ప్రపంచవ్యాప్తంగా సినీ అభి మానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా పుష్ప 2 సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ వచ్చేసింది. ఈ సినిమా చూడడానికి ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు టికెట్లను బుకింగ్ చేసుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక నటన చాలా అద్భుతంగా ఉందని టాక్ వినిపిస్తోంది. శ్రీ లీల కనిపించింది చాలా తక్కువ సమయమే అయినా తనకు మంచి గుర్తింపు లభించనుంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. కాగా, ఈ సినిమా రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏపీలోని జనసేన నేతలు ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అల్లు అర్జున్ నేరుగా వెళ్లి చిరంజీవి కాళ్లు కడిగి నెత్తి మీద చల్లుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇలా చేయనట్లయితే ఈ సినిమాను తప్పకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
కాగా, పుష్ప 2 సినిమాను థియేటర్లలో తన అభిమానులతో కలిసి చూడాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇందుకోసం అల్లు అర్జున్ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ కు వెళ్లనున్నారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజు రాత్రి 9:30 గంటలకు ప్రీమియర్ షోలో అల్లు అర్జున్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
ఈ విషయం పైన ఈరోజు సాయంత్రం వరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, దీనికోసం నిర్వాహకులు సైతం అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమా 200 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టాలని చిత్రబృందం భావిస్తోంది. మరి ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.