వైరల్: ఏ రాజు కూడా జయించలేని కోట.. మన ఇండియాలో.. ఎక్కడంటే..?
భారతదేశం యొక్క పశ్చిమ భాగంలో సముద్ర తీరానికి ఉన్న కొంకణ్ కరై అనే ప్రాంతం ఉన్నది.. 17వ శతాబ్దం లో దీనిని కొంకణ్ నిర్మించారట. దీనికి జంజీరా కోట అని పిలుస్తూ ఉంటారు.. అయితే ఈ కోట శత్రువులచే పట్టుబడని ఒక ప్రత్యేకమైన కోటగా నిలిచింది. ఇండియాలో ఒకానొక సమయంలో ఎన్నో కోటలు ఇతర రాజులచే స్వాధీనం చేశాయి కానీ ఇప్పటికీ ఎవరు ఒంటరిగా ఈ కోటను అయితే జయించలేదట.. కొంకణ్ ప్రాంతం మూడు శతాబ్దాలకు పైగా చాలా కఠినమైన కోటతో నిలబడి ఉన్నదట.. 14వ మరియు 17వ శతాబ్దం మధ్య ఈ కోటను నిర్మించారు.. ముఖ్యంగా గోల్కొండ కోట, నిజాం నవాబులు , విజయనగరం రాజులు కట్టించిన భవనాలు కోటలు యుద్దాలకు సాక్షంగా ఎలా ఉన్నాయో మహారాష్ట్రలోని మరుద్ తీర నగరానికి సమీపంలో ఒక ద్వీపంలో నిర్మించిన ఈ జంజీరకోట సముద్రంతో చుట్టి ముట్టబడిన ఒక ప్రత్యేకమైన కోట ఇది..
ఈ కోటకి బలం కూడా ఇదేనట. ఈ కోటను జాన్సీర జలదుర్గగా ప్రసిద్ధి చెందిన నిజాంషాహి రాజవంశానికి చెందిన అహ్మద్ నగర్ సుల్తాన్ సేవలో ఉండేటువంటి మాలిక్ అంబర్ చేత నిర్మించబడిందట.. సుమారుగా 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట ఉన్నదట. ఈ కోట పూర్తి కావడానికి కూడా 22 సంవత్సరాలు పట్టిందట.. అయితే ఈ కోట అండాకారంలో ఉండడం విశేషం. సుమారుగా 45 అడుగుల ఎత్తు 19 వృత్తాకార కార్రిడర్లు తోరణాలు కూడా కలిగి ఉన్నదట. అయితే ఇందులో ఇప్పటికే కూడా కొన్ని ఫిరంగులను మనం చూడవచ్చట. ఈ కోట చూడడానికి చాలా అందంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందట. ఇక్కడ తీపి నీటి భావి కూడా ఉండడం గమనార్హం.. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కోట ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిందట.. ఈ జంజీర సముద్రపు కోటను ఎంతోమంది ఏలిన రాజులు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారట. ముఖ్యంగా శివాజీ 13 సార్లు ప్రయత్నించిన జయించలేకపోయారట. ఆయన కుమారుడు కూడా ప్రయత్నించిన జరగలేదట. ఇండియాలో అత్యంత ఆకర్షణ ఏమైనా కోటలలో ఇది కూడా ఒకటి. అయితే ఈ కోట ఇప్పటికీ 80% ఎలాంటి మార్పులు లేకుండా చెక్కుచెదరకుండా ఉన్నదట.