‘రై రై’ అంటూ దుమ్మురేపనున్న ‘పెద్ది’ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పటికే ఈ పాటను నేడు(మార్చి 2న) రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ పాటను రిలీజ్ చేసే టైమ్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ పాటను నేడు సాయంత్రం 7.02 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ మరోసారి తన గ్రేస్, స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ పాటను ఒక రేంజ్‌లో చిత్రీకరించారట. ఉత్తరాంధ్ర జానపద బాణీలతో కూడిన పక్కా మాస్ బీట్ ఇది. రామ్ చరణ్ స్టెప్పులు వేస్తే థియేటర్లలో రీసౌండ్ రావాల్సిందే!ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. 'ఉప్పెన'కు దేవి శ్రీ ప్రసాద్ ఎలాగైతే ప్రాణం పోశారో, 'పెద్ది' కోసం రెహమాన్ తనదైన శైలిలో మ్యాజిక్ చేశారట.
'రై రై రా రా' పాటలో రెహమాన్ సిగ్నేచర్ స్టైల్ తో పాటు లోకల్ మాస్ బీట్స్ మిక్స్ చేశారట. ఈ పాట వింటే చాలు.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.ఈ సినిమా కోసం చరణ్ తన బాడీని పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారు. గడ్డం, జుట్టు పెంచి ఒక రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పాటలో చరణ్ ఎనర్జీ పీక్స్‌లో ఉంటుందని టీమ్ చెబుతోంది.అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో చరణ్ సరసన నటిస్తోంది.ఇప్పటికే 'దేవర'తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన జాన్వీ, ఈ సినిమాలో ఒక పక్కా పల్లెటూరి పిల్లగా కనిపించబోతోంది. ఈ పాటలో చరణ్-జాన్వీల మధ్య ఉండే కెమిస్ట్రీ హైలైట్‌గా నిలవనుంది.మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.