గుండె పట్టుకున్న జగన్... వైసీపీ నుండి నెక్స్ట్ జంపయ్యేది వీళ్ళేనా?
అందులో ముఖ్యంగా గత వైసీపీ హయాంలో జగన్ తలలో నాలుకలా వ్యవహరించిన మంత్రి పేర్ని నాని టీడీపీ కూటమిలోకి జంపింగ్ కి సిద్ధపడినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. దానికి రుజువు ఏమిటని అడిగే వారికి తాజా ఉదాహరణ చెప్పుకొస్తున్నారు విశ్లేషకులు. తాజాగా పేర్ని నాని పవన్ 'సీజ్ ది షిప్' వ్యవహారమై స్పందిస్తూ... జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఆకాశానికెత్తేసిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే నాని జంపింగ్ షురూ అనే కధనాలు కోకొల్లలుగా వెలువడుతున్నాయి. అదేవిధంగా రానున్న రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు, రాజ్యసభ మంత్రులు కూటమి బాట పట్టనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి శ్రీరంగరాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లు కూడా టీడీపీ కూటమి పంచన చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు నాయకులను కోల్పోయిన వైస్సార్సీపీ పార్టీ వీరిని కూడా కోల్పోబోతోంది అన్న వార్తలు రావడంతో వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వైసీపీ నాయకులకు 'రెడ్‌బుక్ లిస్ట్' కూడా కంగారు పెడుతోందని, దాంతోనే వలసలు రానురాను పెరుగుతున్నాయని, భవిషత్తు 2029లో జరగబోయే ఎన్నికల సమయానికి వైస్సార్సీపీ పార్టీ దాదాపు ఖాళీ అవుతుందని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి స్థితిలో జగన్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వేళ్తాడో భవిష్యత్తులో తెలియనుంది.