టేస్టీ తేజ చెప్పింది నిజమే.. బిగ్ బాస్ విన్నర్ అతనేనా?

praveen
బిగ్ బాస్.. ఈ కార్యక్రమానికి ఎప్పుడు బుల్లితెరపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఏడాదికి ఒకసారి ప్రసారమయ్యే ఈ షో చూడడానికి ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. కాగా తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ నడుస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం 14 వ వారం కొనసాగుతోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ ఎనిమిదవ సీజన్ కి ఎండ్ కార్డు పడబోతుంది. దీంతో ప్రస్తుతం బిగ్బాస్ 8 సీజన్ విన్నర్ ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 అయితే బిగ్బాస్ 8వ సీజన్ టైటిల్ అందుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగానే శ్రమిస్తూ ఉన్నారు. ప్రేక్షకులను చూపును ఆకట్టుకొని ఓట్లను కూడగట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు ఎనిమిదిలో 14వ వారం నామినేషన్ విషయానికి వస్తే అవినాష్ తప్పా అందరూ కూడా అటు నామినేషన్స్ లో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన కంటెస్టెంట్ ను సేవ్ చేసుకోవడానికి టాప్ ఫైవ్ లోకి పంపించడానికి.. ప్రేక్షకులు ఓట్లు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన అనధికారిక ఓటింగ్ ప్రకారం గౌతం ప్రస్తుతం అందరి కంటే టాప్ లో ఎవరికి అందనంత ఎత్తులో ఓటింగ్లో అగ్రస్థానంలో ఉన్నాడు అన్నది తెలుస్తోంది.

 ఏకంగా 32.21 శాతం ఓటింగ్ తో అగ్రస్థానంలో ఉన్నాడు గౌతం. ఇక ఆ తర్వాత నిఖిల్ 20.27, ప్రేరణ 14.85%, రోహిణి 12.38%, విష్ణు ప్రియ 10.21%, నవీన్ 10.08% ఓటింగ్ తో గౌతమ్ తర్వాత స్థానంలో ఉన్నారు. అయితే ఇటీవల హౌస్ నుంచి బయటికి వచ్చిన టేస్టీ తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. టైటిల్ రేస్ లో గౌతమ్, నిఖిల్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు అంటూ ప్రశ్నించగా.. గౌతం విన్నర్ అవుతాడని నేను అనుకుంటున్నాను అంటూ టేస్టీ తేజ చెప్పాడు. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన అనాధికారిక ఓటింగ్ చూస్తూ ఉంటే.. గౌతమ్ కే బిగ్ బాస్ టైటిల్ దక్కబోతుంది అన్నది అర్థమవుతుంది. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: