అపరిచితుడు మూవీని ఆ టాలీవుడ్ హీరో మిస్ చేసుకున్నాడా.. చేసుంటేనా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరో హీరో దగ్గరికి వెళ్లి ఆ హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే మామూలుగా అయితే ఒక దర్శకుడు ఒక హీరోని ఊహించుకొని కథ రాసుకుంటూ ఉంటాడు. ఇక ఆ సినిమాలోని హీరో పాత్రకి ఆ హీరోనే సరిగ్గా సరిపోతాడని నమ్ముతూ ఉంటాడు దర్శకుడు. ఈ క్రమంలోనే ఆ హీరోను కలిసి కథ చెప్పడం చేస్తూ ఉంటాడు. కానీ కొన్ని కొన్ని సార్లు దర్శకులకు ఊహించని షాక్ లు ఎదురవుతాయి వి ఇతర సినిమాలో బిజీగా ఉండడం కారణంగానో లేదంటే ఆ దర్శకుడు చెప్పిన కథ నచ్చకపోవడంతోనో ఇక హీరోలు కథలను రిజెక్ట్ చేయడం చూస్తూ ఉంటాం.

 అయితే ఇలా ఒక కథను హీరో రిజెక్ట్ చేసినప్పుడు దర్శకులు చేసేదేం లేక అదే కథతో మరో హీరో దగ్గరికి వెళ్లి చెప్తారు. ఆ హీరోకి నచ్చితే ఆ ఇక తీసి రిలీజ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అటు తమిళంలో తెరకెక్కి తెలుగులో డబ్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అపరిచితుడు మూవీకి కూడా ఇలాంటి ఇలాంటి ఒక విచిత్రమైన స్టోరీ ఉందట. ఈ సినిమాలో విక్రమ్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేసాడు. విక్రమ్  తప్ప మరొకరు ఈ పాత్రలో నటించి ఉంటే సినిమా హిట్ అయ్యేది కాదు అనేంతలా పాత్రకి ప్రాణం పోసాడు.

 కానీ అపరిచితుడు మరో హీరో చేయాల్సిందట. కానీ శంకర్ అనుకున్న కథను కాదు మరో కథను. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి 2005లో రిలీజ్ అయిన ఏ సినిమా తెలుగులో కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అప్పట్లోనే 13 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే అపరిచితుడు అనే టైటిల్ విక్రమ్ కంటే ముందు మరో హీరో కోసం వాడుకోవాలని చూశారట. అయితే ఆ సినిమాకు దర్శకుడు శ్రీనువైట్ల   నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించిన ఇదే నిజం. ఒకప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో అపరిచితుడు సినిమా తెరకేక్కాల్సి ఉంది. అందులో హీరోగా రాజశేఖర్ నటించాలని అనుకున్నాడు. అయితే ఇక ఈ సినిమా టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారు. 1994 లో దర్శకుడు శ్రీనువైట్ల రాజశేఖర్ హీరోగా అపరిచితుడు అనే సినిమా చేద్దామనుకున్నారు. 25 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. ఇక తర్వాత 1998లో నీకోసం అనే సినిమా ద్వారా దర్శకుడిగా శ్రీనువైట్ల ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రాజశేఖర్ సినిమా టైటిల్  అపరిచితుడు అనే టైటిల్ ను వాడుకున్న దర్శకుడు శంకర్ విక్రమ్ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు. కాగా శంకర్ తెరకెక్కించిన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు సినిమాలు కూడా ముందుగా రాజశేఖర్ హీరోగా తెరకెక్కే సినిమాకు టైటిల్ గా అనుకున్నవి కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: