రాయలసీమ:ఫ్యాన్ కి అనుకూలంగా మారుతోందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత క్రమక్రమంగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. కూటమి పార్టీ నేతలలో విభేదాలతో పాటుగా, వైసీపీ పట్ల సానుకూలత కూడా ప్రజలలో పెరిగినట్టుగా కనిపిస్తోంది. రాయలసీమలో మొత్తం 52 శాసనసభ నియోజవర్గాలు ఉండగా ఇందులో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన తీవ్రమైన వ్యతిరేకత ఉండడమే కాకుండా పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, అమరావతికి ఎక్కువ అప్పులు చేయడం, ముఖ్యంగా అక్కడ భూములు ఎక్కువగా తీసుకోవడం, సూపర్ సిక్స్ హామీలు(మహిళలకు 1500) అమలు చేయకపోవడం, ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి అంశాలు కూటమిని తీవ్రస్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులలోకి నెట్టివేస్తున్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు.


2024 ఎన్నికలలో కర్నూలులో 14 స్థానాలు ఉంటే 2 స్థానాలలో వైసిపి గెలిచింది. అనంతపురం జిల్లాలో 14 నియోజవర్గాలు ఉంటే కూటమి క్లీన్ స్వీట్ చేసింది. కడపలో 10 నియోజకవర్గాలు ఉంటే 3 వైసీపీ గెలిచాక మిగిలిన చోట్ల కూటమే గెలిచింది. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 2 మాత్రమే వైసిపి గెలిచింది. మిగిలిన చోట్ల కూటమినే గెలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కడప, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల పరిస్థితులు మారుతున్నట్లుగా ఎక్కువగా సంకేతాలు కనిపిస్తున్నాయి.


ఇక్కడ కూటమి నేతలు పెద్దగా యాక్టివ్గా కనిపించకపోవడం వల్ల క్రమంగా వైసిపి నేతలు కూడా బలం పెంచుకున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా జరగబోతున్నాయని ఆ తర్వాత వైసిపి పార్టీ మరింత బలపడే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రజలలో అధికార పార్టీ పైన ఎప్పుడూ కూడా కొంత అసంతృప్తి కనిపిస్తుంది. కానీ నేతలు చేస్తున్న కొన్ని తప్పుల వల్ల కూటమి పైన మరింత ఎక్కువగా మారిందట. అలాగే జగన్ రాయలసీమ ప్రాంతవాసిగా చూడడంతో మరికొంత ప్లస్ గా మారిందని చెబుతున్నారు. మరి ఇకనైనా కూటమి ప్రభుత్వం రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి పెట్టి, స్థానిక ఎన్నికలలో గెలిచి తమ బలాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: