నేను ఆ బ్యాచ్ కాదు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్?
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ సినిమాలో నిధి తన అందాల నిధితో కుర్రకారుని బాగా ఆకట్టుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు ఇక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. అలాగే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. తమిళ్ లో శింబు, జయం రవి సరసన సినిమాలు చేసి మెప్పించింది. అలాగే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమాలో కూడా నటించింది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హరిహరవీరమల్లు సినిమాతో నిధి ప్రేక్షకుల మందికి రాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా నిధి అగర్వాల్ నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో నిధి అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు షాక్ అయ్యే సమాధానం ఇచ్చింది అమ్మడు.
విషయం ఏమిటంటే... సోషల్ మీడియాలో నిధి ప్రేక్షకులతో మమేకం అవుతున్న సమయంలో ‘మీకు తెలుగు వచ్చా మేడమ్?’ అని ఓ నెటిజన్ అడగ్గా దానికి నిధి అగర్వాల్ ఎవ్వరూ ఊహించని సమాధానం ఇచ్చింది. నాకు తెలుగు వస్తుందండీ.. ఎందుకు మీకు ఆ డౌట్ ? ‘అందరికీ నమస్కారం’ అని చెప్పే బ్యాచ్ నేను ఎంతమాత్రమూ కాదు!’ అనిచెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. అలాగే ప్రభాస్ రాజా సాబ్ సినిమా సెట్ లో ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి అని కూడా ఈ సందర్భంగా తెలిపింది. అలాగే పవన్ కళ్యాణ్ తో నటిస్తున్నారు కదా?ఆయన గురించి చెప్పండి అని అడగగా... ఆయన ఓ లెజెండ్, పవర్‌ఫుల్ కళ్లు.. ఇలా ఆయన గురించి చాలా చెప్పొచ్చు. ఒక్క మాటలో అయితే కష్టం! అని తెలిపింది నిధి. దాంతో జనశ్రేణులు పండగ చేసుకుంటున్నారు.