మిథాలీ రాజ్ మన బ్యాచ్చే... ఐపీఎల్‌లో ఆ టీముకే ఆమె ఓటు!
ఇక అసలు విషయంలోకి వెళితే... తాజాగా యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా హోస్ట్ చేసిన పోడ్‌కాస్ట్‌లో ఆమె ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. దాంతో కుర్రాళ్ళు ఫుల్ ఖుషిగా ఉన్నారు. సోషల్ మీడియా వేడిఅక్కగా మిథాలీ తమ బ్యాచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే.. ఈ సందర్భంగా ఆమె తనకు ఐపీఎల్‌లో ఇష్టమైన ఫ్రాంచైజీ ఏదో చెప్పేసింది. రణవీర్ మీరు RCB ఫ్యానా? అని అడుగగా దానికి ఆమె తను RCB ఫ్యాన్ కాదని.. SRH ఫ్యాన్ అని తను మనస్సులోని మాట బయటకు చెప్పేసింది. తను హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి Sunrisers ఫ్యాన్ అని తెలిపింది.
ఈ పోడ్‌కాస్ట్‌లో ఆమె ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదో క్లారిటీ కూడా ఇవ్వడం కొసమెరుపు. క్రికెట్ కోసమే పెళ్లిని పక్కన పెట్టినట్లు చెప్పింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది. మహిళ క్రికెట్లో లెజెండరీ క్రికెటర్ అయినటువంటి మిథాలీ.. 20 ఏళ్లకు పైగా సాగిన తన కెరీర్‌లో మిథాలీ వన్ డే ఇంటర్నేషనల్స్ లో 7,805 పరుగుల చేసి క్రికెట్ చరిత్రలో రికార్డు స్పష్టించింది. మిథాలీకి టెస్ట్ క్రికెట్‌లో కూడా మంచి రికార్డులే ఉన్నాయి. ఒక దశాబ్దం పాటు, ఆమె టాప్-ఆర్డర్ బ్యాటర్ మాత్రమే కాదు, భారత బ్యాటింగ్ లైనప్‌కు ఒక్క పిల్లర్‌గా కూడా నలిచింది. అంతేకాకుండా ఆమె చిన్నప్పుడు భారత సాంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యంలో శిక్షణ పొంది వేదికలపై నాట్యం చేసిన అనుభవం అందుకుంది. ప్రస్తుతం మిథాలి భారతీయ రైల్వేల్లో ఉద్యోగం చేస్తున్న విషయం విదితమే.