ఏంటి మెగా డాటర్ నిహారిక మళ్లీ పెళ్లికి రెడీ అయిందా..నిజంగానే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతుందా..ఇంతకీ పెళ్ళై విడాకులు తీసుకున్న ఈ హీరోయిన్ మళ్ళీ ఎవరి ప్రేమలో పడింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. కొణిదెల నాగబాబు పద్మజల ముద్దుల కూతురు నిహారిక.. ఈ ముద్దుగుమ్మ మొదట పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని రెండు సంవత్సరాలు ఎంతో హ్యాపీగా భర్తతో కలిసి ఉంది.కానీ ఆ తర్వాత ఈ జంటపై ఎవరి దిష్టి పడిందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అలా చివరికి గొడవలు తీవ్రమవ్వడంతో నిహారిక అత్తింటిని వదిలి పుట్టింటికి వచ్చేసింది.దాంతో నిహారిక విడాకుల వార్తలు మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అప్పటినుండి నిహారిక విడాకులు తీసుకునే వరకు కూడా ఈమెని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు..
అయితే ఎట్టకేలకు విడాకులు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయింది.. ఇక నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య కూడా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి.కానీ అది నిజం కాలేదు. అయితే రెండో పెళ్లి విషయంలో మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య కంటే నిహారికనే ముందుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మెగా డాటర్ నిహారిక త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందట.ఇక గతంలో పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలలో నిహారిక రెండో పెళ్లి చేసుకుంటారని క్లారిటీ ఇచ్చింది.
కానీ తాజాగా మాత్రం పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది ఈ ముద్దుగుమ్మ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇక నిహారిక పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తేనని.. ఆస్తిపాస్తులు బాగా ఉన్న ఇండస్ట్రీ వ్యక్తితోనే నిహారిక ప్రేమలో పడినట్టు సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మళ్లీ పెళ్లికి రెడీ అంటున్నా నిహారిక.. బలిసినడినే బుట్ట లేసిందిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాల నిహారిక రెండో పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమవుతాయో