పవన్ వల్ల కానిది విజయ్ చేసి చూపిస్తున్నారు..?
ఈ ఎన్నికలలో అతిపెద్ద సంచలనం ఏమిటంటే టీవీకే పార్టీ అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తోంది. ఈ ఎన్నికలలో టీవీకే పార్టీ 104 స్థానాలకు పైగా ఆధిక్యతలో కొనసాగుతోంది. ఏఐఏడీఎంకే పార్టీ రెండవ స్థానం డిఎంకె పార్టీ మూడవ స్థానంలో ముందుకు వెళ్తోంది. తమిళనాడులో ఏ పార్టీ అయినా సరే అధికారం దక్కించుకోవాలి అంటే 118 సీట్ల మెజారిటీ రావాలి కానీ ప్రస్తుతం మాత్రం అక్కడ చూస్తూ ఉంటే ఆ మెజారిటీ సీట్లు ప్రస్తుతం లేనట్టుగానే కనిపిస్తోంది. కానీ సింగిల్ పార్టీగా మాత్రం టీవీకే పార్టీ సంచలనంగా నిలుస్తోంది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూ ఉండడంతో సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల వల్లే విజయ్ మెజారిటీ సీట్లు రావడానికి కారణం అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఏపీలో జనసేన పార్టీ పేరుతో పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించినప్పుడు ఈ స్థాయిలో దూకుడు ఎక్కడ కనిపించ లేదు. 2019లో సిపీఎం, సిపిఐ, బీఎస్సీ వంటి పార్టీలతో కలిసి పోటీ చేసినప్పటికీ, కనీస ఓట్లు కూడా పడట్లేదు. కొన్నిచోట్ల డిపాజిట్లు సైతం దక్కలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం వంటి ప్రాంతాలలో కూడా ఓడిపోయారు. కేవలం రాజోలు ప్రాంతంలో మాత్రమే పవన్ పార్టీ అభ్యర్థి గెలిచారు. ఇక 2024 నాటికి మాత్రం మొదట బిజెపి పార్టీతో పొత్తు ఆ తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకుని డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.
పవన్ కళ్యాణ్ లాగే స్టార్ డం కలిగి ఉన్న విజయ్ మాత్రం పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అధికారాన్ని అందుకోవడానికి చేరు అయినట్టుగా కనిపిస్తోంది. తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నిలవబోతోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఎదురైన ఎన్నో ప్రతికూల సంఘటనలు , వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అక్కడ హీరో (విజయ్) కీ ఉన్న అభిమానులను ఓట్ల రూపంలో మార్చుకోగలిగారు. కానీ అది పవన్ కళ్యాణ్ వల్ల కాలేకపోయింది, 2024 లో మాత్రం కూటమిలో భాగంగా 21 స్థానాలలో పోటీ చేసి గెలిచారు. మరి 2029లో ఏం చేస్తారో చూడాలి మరి.