ఆదిత్య 369 సీక్వెల్... బాలయ్య రియాక్షన్ ఇదే..!

lakhmi saranya
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ' ఆదిత్య 369' 1991 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గణ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ గురించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. నందమూరి బాలకృష్ణ నటించిన ఐకానిక్ చిత్రాల్లో ' ఆదిత్య 369' ఒకటి. ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దీనిని రూపొందించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తలకెక్కిన ఈ సినిమా 1991 లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
సీక్వెల్ కోసం సినీ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ' ఆదిత్య 369' సీక్వెల్ గా 'ఆదిత్య 999 మ్యాక్స్ ' ఉంటుందని ఇప్పటికే బాలకృష్ణ పలు సందర్భాల్లో తెలిపారు. తాజాగా ఆయన సీక్వెల్ విశేషాలు పంచుకున్నారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ' అన్ స్టాపబుల్ సీజన్ 4' కార్యక్రమంలో దీని గురించి మాట్లాడారు. " ఆదిత్య 369కు సీక్వెల్ గా ' ఆదిత్య 999' రానుంది. మా అబ్బాయి మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చెయనున్నాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. అన్ని కుదిరితే 2025లో విడుదల చేసే అవకాశం ఉంది" అని తెలిపారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 6 న ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో ' ఆదిత్య 369' సినిమాకు సంబంధించిన గెటప్ లో బాలయ్య స్టేజ్ పై సందడి చేయనున్నారు. ఆ సినిమాతో పాటు సీక్వెల్ విశేషాలు కూడా పంచుకున్నారు. టైమ్ మిషన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ' ఆదిత్య 369' తలకెక్కింది. బాలకృష్ణ, మోహిని ప్రధాన పాత్రలో నటించారు. కథానాయకుడు భూతకాలం, భవిష్యత్తులోకి ప్రయాణిస్తే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్న ఆలోచనతో దీనిని రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: