పుష్ప -2 ఏపీ: రచ్చ లేపుతున్న ఫ్లెక్సీలు.. వార్ తప్పదా..?

Divya
పుష్ప-2.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీకి భారీ హైప్ ఏర్పడడానికి ముఖ్య కారణం.. 2024 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడైన శిల్పా రవి రెడ్డికి సపోర్ట్ చేయడం వల్ల చాలా మంది జనసేన కార్యకర్తలు, మేగా అభిమానులు, టిడిపి కార్యకర్తలు సైతం చాలామంది విమర్శలు చేశారు.. కొంతమంది మెగా హీరోలు అన్ ఫాలో చేయడమే కాకుండా.. మరి కొంతమంది సినిమా ఈవెంట్లలో సెటైరికల్ గా మాట్లాడారు..అయినా కూడా వాటన్నిటిని లెక్కచేయకుండా అల్లు అర్జున్ తన పని తాను చేసుకుంటూ ఉన్నారు.. అయితే పుష్ప-2 సినిమా రేపటి రోజున రిలీజ్ కాబోతున్న సందర్భంగా చాలా చోట్ల ఫ్లెక్సీలు సైతం భారి స్థాయిలో వెలుపడ్డాయి..

అయితే ముఖ్యంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, అల్లు అర్జున్ ఫోటోలు సైతం వైరల్ గా మారడంతో మరొకసారి హట్ టాపిక్ గా మారుతోంది.. పుష్ప-2 చిత్రానికి సపోర్టుగా వైసీపీ నేతలు సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు.. ఇటీవలే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో మాజీ సీఎం జగన్ తో పాటు అల్లు అర్జున్ ఉన్న ఫోటోలు భారీగా వెలిశాయి.. అయితే ఈ ఫ్లెక్సీల పైన" మా కోసం నువ్వు వచ్చావు.. మీకోసం మేము వస్తాము తగ్గేదే లేదు అన్నట్లుగా నినాదాలు" తెలియజేస్తూ ఉన్నారు.

అలాగే మరొకవైపు పిఠాపురంలో కూడా పుష్ప-2 ఫ్లెక్సీలు కట్టడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను సైతం చించేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికీ కూడా చాలామంది పుష్ప-2 చిత్రాన్ని ఆడనివ్వమంటూ జనసేన నేతలు కార్యకర్తలు సైతం ఆగ్రహాన్ని తెలియజేస్తున్నప్పటికీ.. అంతకుమించి ఫ్లెక్సీలు సైతం వైరల్ గా మారుతున్నాయి.. సోషల్ మీడియాలో కూడా ఈ  ఫ్లెక్సీలు వైరల్ గా మారుతున్నా.. మొత్తానికి మరొకసారి ఫ్లెక్సీలతో ఏపీలో మరొకసారి రచ్చ జరుగుతోంది.. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కచ్చితంగా వార్ తప్పదు అనేలా కనిపిస్తోంది.. మొత్తానికి అటు మెగా అభిమానులు కూడా పూర్తిగా అల్లుఅర్జున్ ని విమర్శిస్తూ ఉండడంతో.. ఇది వైసిపి పార్టీకి బాగా ఉపయోగపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: