లేట్ గా ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ ను షేక్ చేసిన తారక్.. మాస్ లుక్స్ తో క్లాస్ హిట్!

Reddy P Rajasekhar
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో కొత్త తరహా కథాంశాన్ని ఎంచుకున్న ప్రతి సందర్భంలో భారీ సక్సెస్ దక్కింది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా జనతా గ్యారేజ్ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో లేట్ గా ఎంట్రీ ఇచ్చినా తారక్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడనే చెప్పాలి. తారక్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఈ సినిమా కూడా ఒకటి.
 
అప్పట్లో థియేటర్లలో రిలీజైన 50 రోజులకే బుల్లితెరపై ప్రదర్శించబడటం ద్వారా ఈ సినిమా పేరు వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో మొదట ఫ్యాష్ బ్యాక్ సీన్లు ఉండటంతో పాటు మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ పాత్ర ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. ఈ సినిమాలో మాస్ లుక్స్ తో తారక్ క్లాస్ హిట్ ను అందుకున్నారనే చెప్పాలి.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంచుకుంటున్న కథలు కొత్తదనంతో తెరకెక్కుతున్న కథలు కాగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్ విషయంలో వెరియేషన్ చూపిస్తుండగా తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద 550 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
 
దేవర సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా తారక్ యాక్టింగ్ స్కిల్స్, పోటీగా మరో సినిమా లేకపోవడం వల్ల దేవర రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించిందని చెప్పాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాతో వచ్చే ఏడాది లక్ పరీక్షించుకుంటున్నారు. వార్2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: