పవన్ ఎంట్రీ లేటైనా సినిమా మాత్రం వేరే లెవెల్.. బాక్సాఫీస్ షేకైందిగా!
ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ను షేక్ చేశారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి కూడా తక్కువనే సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ పవన్ ఫ్యాన్స్ కు మాత్రం ఎంతగానో నచ్చేసింది. వకీల్ సాబ్ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించినా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొట్టిందనే చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు షూట్ లో పాల్గొంటుండగా ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవన్ కళ్యాణ్ పారితోషికం ప్రస్తుతం 70 నుంచి 90 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
కెరీర్ విషయంలో పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. పవన్ రాజకీయాల్లో సైతం బిజీగా ఉండటంతో ఇందుకు సంబంధించి క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయాల్సి ఉంది. పుష్ప2 సినిమాకు సైతం భారీ స్థాయిలో టికెట్ రేట్ల పెంపునకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ రేట్లు 800 కంటే ఎక్కువగా ఉన్నాయి.