ఆ స్టార్ హీరోకి ఒక ప్లాఫ్ కూడా ఇవ్వని రాఘవేంద్రరావు ఇంతకీ ఆ హీరో ఎవరంటే..!
కృష్ణ - రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన సినిమాల విషయానికి వస్తే.. ముందుగా వీరి కాంబినేషన్లో బలే కృష్ణుడు సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రెండో సినిమాగా ఘరానా దొంగ సినిమా వచ్చింది. ఈ సినిమాలో కృష్ణకి జంటగా శ్రీదేవి నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక కృష్ణ , రాఘవేంద్ర కాంబోలో వచ్చిన మూడో సినిమా ఊరుకు మొనగాడు.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. కృష్ణ , రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన నాలుగో సినిమా అడవి సింహాలు.. ఈ సినిమాలో కృష్ణతో పాటు కృష్ణంరాజు కూడా హీరోగా నటించారట .. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ కాంబోలో వచ్చిన ఐదో సినిమా శక్తి ఈ సినిమాల్లో కృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాబినమయం చేశాడు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఇక కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ఆరో సినిమా ఇద్దరు దొంగలు. ఈ సినిమాలో కృష్ణతో పాటు అందాల నటుడు శోభన్ బాబు కూడా మరో హీరోగా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గాా నిలిచింది.
కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ఏడో సినిమా.. అగ్నిపర్వతం.. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన అన్ని సినిమాలు కన్నా ఓ గోప్ప సినిమాగా నిలిచింది. కృష్ణ , రాఘవేందర్రావు కాంబినేషన్లో వచ్చిన ఎనిమిదో సినిమా వజ్రాయుధం. ఈ సినిమా కూడా హిట్ సినిమాగా నిలిచింది. కృష్ణా రాఘవేంద్రరావు కాంబినేషన్లు వచ్చిన తొమ్మిదో సినిమా రాజకుమారుడు. ఈ సినిమాలో కృష్ణ గెస్ట్ రోల్ లో కాసేపు కనిపించాడు. సినిమాను మహేష్ ను హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా. మహేష్ కృష్ణ వారసుడుగా తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ విధంగా ఈ ఇద్దరి కలయికలు వచ్చిన తొమ్మిది సినిమాలలో 8 సినిమాల్లో కృష్ణ హీరోగా నటించారు. అతిథి పాత్రలో రాజకుమారుడు సినిమాలో మెరిసేరు మొత్తంగా విడుదల కలర్ లో వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం విశేషం.