వీటిని తక్కువ అంచనా వేస్తున్నారా?.. అయితే పప్పులో కాలేసినట్లే..!
మినుముల్లోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. మాంసాహారం తినని వారికి మినుములు చక్కటి పోషణను అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వీటిని రోజులో కనీసం 2 లేదా 3 సార్లు అయినా ఆహార పదార్థాలతో ఉపయోగించాలి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరిచి, కడుపు మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది. గట్ బ్యాక్టీరియా తయారి కోసం ఇది సహాయపడుతుంది. ఇన్సులిన్, స్థాయిలను సమతూల్యం చేసి, రక్తహీనతను దూరం చేయటంలో ఉపయోగపడతాయి. శరీరంలోని ఎముకలు బలంగా ఉండాలన్నా... విరిగిన ఎముకలు, కీళ్లవాతం ఉన్నవారికి ఇది ఒక మంచి మెడిసిన్ అని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు మినుములతో తయారుచేసిన ఆహారం తినడం వల్ల శరీరానికి పోషణ అందుతుంది. మినుముల్లోని పొటాషియం, పీచు పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహజీవనిలా పనిచేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. మినుములను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వారంలో 3 సార్లు అయినా ఈ మినుములతో ఇడ్లీ, దోస, ఊతప్పం వంటి ఆహార పదార్థాలను తయారు చేసుకునే తినటం వల్ల హెల్దీగా ఉంటారు. మినుములతో చేసిన సున్నుండలు రోజులో ఒకటి అయినా తినటం వల్ల శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. కాబట్టి అందరూ కూడా మినుములను తప్పకుండా తినండి.