యోగా చేస్తూ ప్రాణం పోగొట్టుకున్న హీరోయిన్.. వైరల్ వీడియో?
అయితే ఇక్కడ ఒక హీరోయిన్ కూడా ఇలాగే చేయాలని అనుకుంది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో యోగా చేయడానికి సిద్ధమైంది. కానీ అక్కడే తనకోసం మృత్యువు వేచి చూస్తుంది అన్నది మాత్రం ఊహించుకోలేకపోయింది. ఏకంగా సముద్రపు ఒడ్డున వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో యోగా చేయడం మొదలుపెట్టిన హీరోయిన్.. చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారి పోయింది. ఈ ఘటన థాయిలాండ్ లో వెలుగులోకి వచ్చింది. రష్యాకు చెందిన 24 ఏళ్ల యువ నటి కెమిల్లా థాయిలాండ్ పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలోనె ఒక ద్వీపంలో నీటి ఒడ్డున రాళ్లపై కూర్చొని ఇక ప్రశాంతం గా ధ్యానం చేయాలని అనుకుంది.
ఈ క్రమం లోనే సముద్రపు ఒడ్డున ఇలా ధ్యానం చేస్తున్న సమయం లో ఊహించని ఘటన జరిగింది. భారీ కెరటం దూసుకు వచ్చి ఆమెను సముద్రంలోకి లాక్కెళ్ళింది. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. అయితే ఆమె మళ్లీ బయటికి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆమెను రక్షించేందుకు చుట్టుపక్కన ఉన్నవారు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. చివరికి కొన్ని నిమిషాలకే శవమై ఆమె ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి. ఇది చూసి అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు.