మహానటి సినిమాతో ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్ గా మారిపోయిన కీర్తి సురేష్ ఈ నెల అనగా డిసెంబర్ 11 లేదా 12వ తేదీలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు 15 సంవత్సరాలుగా తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి ఆంటోనీ తట్టిల్ తో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు ఆయనతో తిరిగి నెటిజన్ల కంట పడ్డా కూడా జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పి కప్పిపుచ్చేది.ఇక ఆ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఇతన్నే అంటూ వార్తలు వినిపించాయి. కానీ కీర్తి సురేష్ తల్లి, తండ్రి మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసి ఆ అబ్బాయి మాకు చాలా సంవత్సరాలుగా తెలుసు..ఆయన కీర్తి సురేష్ ఫ్రెండ్..పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ చెవుల్లో పువ్వులు పెట్టారు. అయితే ఎట్టకేలకు అందరూ అనుకున్నదే నిజమైంది.
కీర్తి సురేష్ తన చిన్ననాటి ఫ్రెండ్ అయినటువంటి అంటోనీ తట్టిల్ నే పెళ్లి చేసుకోబోతుంది.ఇక ఈ విషయాన్ని కీర్తి సురేష్ తండ్రి కన్ఫామ్ చేశాక తిరుమల కి వెళ్ళిన సమయంలో కీర్తి సురేష్ కూడా పెళ్లిని అనౌన్స్ చేసింది. దీంతో కీర్తి సురేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అయితే కీర్తి సురేష్ పెళ్లి వేళ ఆమెకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈమె పెళ్లి వార్తల గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే..కీర్తి సురేష్ రెండు సార్లు పెళ్లి చేసుకోబోతుందట. అవును మీరు వినేది నిజమే.
కీర్తి సురేష్ తన పేరెంట్స్ సంప్రదాయం ప్రకారం ఒకసారి పెళ్లి చేసుకుంటే తనకి కాబోయే భర్త ఆంటోని తట్టిల్ క్రిస్టియన్ కావడంతో వారి సాంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి చేసుకోబోతుందట. అలా ఆంటోనీ,కీర్తి సురేష్ ల పెళ్లి రెండు సార్లు జరగబోతున్నట్టు తెలుస్తోంది. గోవాలో వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే కీర్తి సురేష్ పెళ్లి రోజు కట్టుకోబోయే చీరను కూడా ఎంతో స్పెషల్ గా డిజైన్ చేయించుకొని పెట్టుకుందట. ప్రస్తుతం కీర్తి సురేష్ రెండుసార్లు పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త మీడియాలో వైరల్ గా మారింది. ఇక రీసెంట్గా సిద్ధార్థ్ అదితీరావ్ హైదరీ లు కూడా రెండుసార్లు పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.