ఈ బాలీవుడ్ స్టార్ హీరోలు.. నెలకు ఎంత కరెంట్ బిల్ కడతారో తెలిస్తే మైండ్ బ్లాకే?

praveen

సాధారణంగా సెలబ్రిటీల ఖర్చులతో పోల్చుకుంటే ఓ సామాన్యుడి ఖర్చు అందులో ఒకటో శాతం కూడా ఉండదనేది నిర్వివాదాంశం. చిన్న చిన్న అవసరాలకే మనం ఒకటికి వందసార్లు ఆలోచిస్తాము. కానీ వారు అలా కాదు... చాలా మొత్తంలో ఖర్చుపెడుతుంటారు. వారు తాగే నీటి నుంచి, తినే ఫుడ్ వరకు అన్నీ బ్రాండ్ అయ్యి ఉంటాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లగ్జీరీ కార్లు, లగ్జరీ విల్లాలు, చార్టెడ్ ఫ్లైట్స్, ఇలా ఒక్కటేమిటి... ఇలా చెప్పుకుంటూ పొతే ఆ లిస్టు పెద్దదే ఉంటుంది. ఇక వారు నివసించేటువంటి పెద్ద పెద్ద లగ్జరీ ఇళ్లకు వాళ్లు నెలకు ఎంత కరెంట్ బిల్లు చెల్లిస్తారో ఎపుడైనా ఆలోచించారా? బాలీవుడ్‌లోని సెలబ్రిటీలు వారి ఖరీదైన ఇంటికి నెలకు ఎంత కరెంటు బిల్లు కడతారో తెలిస్తే అవాక్కవుతారు. వారు నెలనెలా కట్టిన బిల్లుతో ఒక సామాన్యుడు ఒక ఇంటిని నిర్మించుకోగలడు అనడంలో సందేహమే లేదు!
ఇక్కడ ముందుగా బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ గురించి చెప్పుకోవాలి. బాలీవుడ్ సెలబ్రిటీలందరిలో కూడా షారూక్ ఖానే ఎక్కువ మొత్తంలో కరెంట్ బిల్లు కడుతున్నారని మీకు తెలుసా? అవును, ముంబయిలోని మన్నత్‌లో నివసిస్తున్న షారూక్ ఖాన్ నెలకు 43నుంచి 45 లక్షల రూపాయలను కరెంట్ బిల్లు చెల్లిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ ఫేమస్ కపుల్ సైఫ్ ఆలీఖాన్‌, కరీనాకపూర్‌.. బాంద్రాలోని ఫార్చూన్ హైట్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నివాసానికి వీరూ నెలకు అక్షరాల రూ. 30నుంచి 32 లక్షల కరెంటుబిల్లు చెల్లిస్తున్నారు. అదేవిధంగా మన కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌.. ముంబయిలోని గెలాక్సీ అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. ఈయన నెలకు 23 నుంచి 25లక్షల రూపాయల కరెంటు బిల్లును కడుతున్నారు.
ఇకపోతే ముంబయిలోని జల్సా బంగ్లాలో నివాసం ఉంటున్న బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్  నెలకు 22నుంచి 25 లక్షల రూపాయల కరెంటు బిల్లును, ముంబయిలోని బ్యూమోండే టవర్స్‌లో నివాసం ఉంటున్న హాట్ జంట దీపికా పదుకుణే, రణవీర్ సింగ్‌.. నెలకు రూ. 13నుంచి 15 లక్షల కరెంటు బిల్లును, ముంబయిలోని 4బిహెచ్‌కె అపార్టుమెంట్‌లో నివసిస్తున్న అందమైన జంట కత్రీనాకైఫ్, విక్కి కౌశల్ నెలకు రూ. 8నుంచి 10లక్షల కరెంట్ బిల్లు చెల్లిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ విషయానికొస్తే, అందరీతో పోల్చుకుంటే ఈ స్టార్ హీరో కరెంటు బిల్లు కాస్త తక్కువే కడుతున్నాడని చెప్పుకోవచ్చు. అమీర్‌ఖాన్ నెలకు రూ. 9 నుంచి 11లక్షల రూపాయల కరెంటు బిల్లును కడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: