ఇన్నాళ్ళకి.. ఆ కుర్ర హీరోకి ట్రెండ్ బోధపడిందిగా.. అందుకే?

praveen

అవును, ఇన్నాళ్ళకి ఆ కుర్ర హీరోకి ట్రెండ్ పూర్తిగా బుర్రకెక్కింది. అతను మరెవరో కాదు, డెబ్యూ మూవీ ఎస్ఆర్ కళ్యాణమండపంతో సూపర్ హిట్ కొట్టి, ఆ తర్వాత కథల ఎంపికలో కాస్త తడబడిన హీరో కిరణ్ అబ్బవరం. ఆ సినిమా తరువాత అతను హీరోగా చేసిన ఓ అరడజను సినిమాలు అన్నీ ప్లాపులుగా మిగిలాయి. ఇక ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా క. ఒకే అక్షరంని టైటిల్ గా పెట్టుకున్న ఈ సినిమాపైన అంచనాలు గట్టిగానే ఉన్నాయి మరి! ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమానుండి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షలను ఒక రేంజులో అలరించాయి కాబట్టి.
మరోరకంగా చూస్తే ఇదొక ప్రయోగం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, తెలుగు తెరపై ఇలాంటి ఓ కధ ఇంతకు మునుపు రాలేదని సమాచారం. అందుకే మన హీరోనే స్వంతంగా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోవడంతో పాటు కథ మీద నమ్మకంతో బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా వచ్చే వారం, అక్టోబర్ 31 దీపావళి పండగ సందర్భంగా రిలీజుకి సిద్ధంగా ఉంది. ఈ దీపావళికి పోటీ చాలా గట్టిగా ఉన్నప్పటికీ ధీమాగా ఉన్నాడు మన హీరో కిరణ్ సబ్బవరం. ఎందుకంటే సినిమా సబ్జెక్టు అటువంటిది మరి.
ఈ నేపథ్యంలోనే సినిమా చిత్ర యూనిట్ ప్రసారాలు షురూ చేసింది. విజయవాడలో లాంచ్ ఈవెంట్ చేసి ఇవాళ ఉదయం ఆన్ లైన్ లో అందుబాటులోకి తేవడం జరిగింది. కాన్సెప్ట్ విషయానికొస్తే, కొన్ని దశాబ్దాల క్రితం కొండల మధ్య ఉండే ఒక మారుమూల గ్రామంలో పని చేసే ఒక పోస్ట్ మ్యాన్ (కిరణ్ అబ్బవరం) అనుకోకుండా వేరే వ్యక్తి రాసిన ఉత్తరం చదవడం వల్ల ఎలా ప్రమాదంలో పడతాడు అనేది కథ. దర్శకుడు "సుజిత్ అండ్ సందీప్" చెప్పిన కథకి ఇంప్రెస్ అయిన కిరణ్ ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణ ఖర్చులు కూడా భరించాడు. అవును, అవసరం లేని మూస, మాస్ జోలికి పోకుండా విరూపాక్ష, మంగళవారం తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ‘క’ని ఎంచుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: