సమంతను అవమానించిన టాలీవుడ్‌ హీరో..ముఖం మీదే?

Veldandi Saikiran
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్న సంగతి తెలిసిందే. తన క్యూట్ మాటలతో, ఎక్స్ప్రెషన్స్ తో, నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న ఈ చిన్నది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను ఎన్నో ప్రశంసలు అందుకుంది. అనంతరం వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను పొందింది.

పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, నితిన్, నాని వంటి ఎందరో స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. అక్కినేని నాగచైతన్యతో వివాహ అనంతరం సమంత సినిమాలకు కాస్త దూరంగా ఉంది. విడాకుల అనంతరం మళ్లీ ఎప్పటిలాగే వరుస పెట్టి సినిమాలలో నటిస్తోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం సమంతకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఎంతోమంది స్టార్ హీరోలతో నటించింది. కానీ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఇన్ని రోజులు ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఎలాంటి సినిమాలో నటించలేదు. వీరిద్దరూ కలిసి సినిమాలో నటించకపోవడానికి గల ప్రధాన కారణం ప్రభాస్ హైట్ ఎక్కువ అని తెలుస్తోంది. ప్రభాస్ 6 అడుగులు ఉంటే సమంత 5.2 అడుగులు మాత్రమే ఉంటుంది. హైట్ కారణంగానే వీరిద్దరూ సినిమా చేయలేదేమోనని అభిమానులు అంటున్నారు.

అయితే ప్రభాస్, శ్రద్ధా కపూర్ కలిసి సాహో సినిమాలో నటించారు. శ్రద్ధ కపూర్ హైట్ కూడా చాలా తక్కువే ఉంటుంది. అయినప్పటికీ ప్రభాస్ ఈ హీరోయిన్ తో కలిసి చేయగా లేనిది సమంతతో చేస్తే ఏమవుతుందని అంటున్నారు. అయితే ప్రభాస్ కావాలనే సమంతను రిజెక్ట్ చేసి ఉండుంటాడేమోనని మరి కొందరు అంటున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: