రీమేక్ సినిమా అని బాలయ్య రిజెక్ట్ చేసిన మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రాజశేఖర్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో చాలా సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బాలయ్య తన కెరియర్లో ఒక సినిమాను రీమేక్ మూవీ రిజెక్ట్ చేశాడట. ఇక ఆ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం రాజశేఖర్ హీరో గా సముద్ర దర్శకత్వంలో సింహరాశి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఇకపోతే ఈ సినిమాలోని రాజశేఖర్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఒక రీమేక్ మూవీ. ఈ మూవీ దర్శకుడు అయినటువంటి సముద్ర ఈ సినిమాను మొదట బాలకృష్ణ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు ఈ విషయాన్ని కూడా చెప్పాడట.

ఇకపోతే బాలకృష్ణ మాత్రం రీమిక్ సినిమా చేయడం ఇష్టం లేకపోవడంతో ఈ మూవీ ని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత సముద్ర , రాజశేఖర్ ను కలవడం , ఈ సినిమా రీమేక్ గురించి చెప్పడంతో ఆయన మాత్రం ఈ మూవీ రీమిక్ లో నటించడానికి ఆసక్తి చూపించాడట. అలా బాలయ్య రిజెక్ట్ చేసిన మూవీ తో రాజశేఖర్ అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రాజశేఖర్ నటించిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇక బాలయ్య నటించిన సినిమాలు మాత్రం వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: