భీమ్స్ తో కార్నర్ అవుతున్న తమన్ !
స్టార్ హీరోలకు తక్కువగా పనిచేసిన భీమ్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పాటలకు సంబంధించిన బజ్ పరంగా వెంకటేష్ అనీల్ రావిపూడి ల ‘సంక్రాంతికి వస్తుననాం’ పాటలు టాప్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు భీమ్స్ ఇచ్చిన మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి.
వాటిని అనిల్ రావిపూడి తెరకెక్కించిన తీరుతో పాటు ఆడియోగా వినడానికి బాగుండటంతో వ్యూస్ లో ‘గోదారి గట్టు’ పాట టాప్ లో ట్రెండింగ్ అవుతోంది దీనికితోడు ఈసినిమాకు సంబంధించి వెంకటేష్ స్వయంగా పాడిన సాంగ్ సైతం అందరికీ బాగా నచ్చడంతో సంక్రాంతికి విడుదలకాబోతున్న ఈమూవీ పై అంచనాలు పెరిగి పోతున్నాయి. మరొక వైపు తమన్ సంగీత దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’ ‘డాకు మహారాజ’ మూవీలోని పాటలు అంతంత మాత్రంగా ట్రెండ్ అవుతున్న నేపధ్యంలో ఈసినిమాలను కొనుకున్న బయ్యర్లు టెన్షన్ పడుతున్నట్లు టాక్.
‘గేమ్ ఛేంజర్’ మూవీలో ఇప్పటి వరకు విడుదలఅయిన పాటలు హిట్ అయినప్పటికీ ఆ పాటలతో యూత్ కనెక్ట్ కాలేకపోతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘డాకు మహారాజ్’ సినిమాకు సంబంధించిన పాటలు హిట్ అయినప్పటికీ ఆపాటలు గతంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ స్థాయిలో హిట్ కాలేదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. దీనితో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బీమ్స్ తో గట్టిపోటీ ఎదురవుతోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..