రోజా లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు.. పెళ్లికి ఇంట్లో ఒప్పుకున్నా తప్పని తిప్పలు!

MADDIBOINA AJAY KUMAR
రోజా సెల్వమణి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రోజా సెల్వమణి అసలు పేరు శ్రీలతా రెడ్డి. ఈమె టాలీవుడ్ సినిమా నటి, రాజకీయ నాయకురాలు. రోజా తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. అలాగే ఈమె నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా కూడా ఎన్నికైంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా ఆర్కే రోజాకు 2023 జనవరి 30న చోటు లభించింది. దీంతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సాయ్ కి ఆమె దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.
రోజా 1972 నవంబరు 17న చిత్తూరు జిల్లా, తిరుపతిలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులు నాగరాజురెడ్డి, లలిత. ఈమెకు కుమారస్వామిరెడ్డి, రాంప్రసాదరెడ్డి అని ఇరువురు సోదరులు ఉన్నారు. చిత్తూరు జిల్లాలోనే పుట్టినా రోజా కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివింది. తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలైంది. కొన్ని సంవత్సరాలు, రోజా కూచిపూడి నృత్యాన్ని కూడా అభ్యసించింది. రోజా ప్రముఖ తమిళ సినీ దర్శకుడు ఆర్‌కే సెల్వమణిని ప్రేమ పెళ్ళిచేసుకుంది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు.
అయితే రోజా లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయంట.  ఈమెని పెళ్లి చేసుకోవడం కోసం దాదాపుగా పదేళ్లు సెల్వమణి వెయిట్ చేశారట. సెల్వమణి, రోజా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ.. సెల్వమణి ముందుగా రోజా తల్లిదండ్రుల అంగీకారం తీసుకోని తర్వాత ఆమెకి ప్రపోజ్ చేశారట. అలాగే ఆయన తనకి ఎప్పటివరకు నటించాలని ఉంటే అప్పటివరకు నటిస్తూనే ఉండమని.. దానికి ఎంత సమయం పట్టినా పర్వాలేదని చెప్పారంట. పెళ్లికి రోజా వల్ల ఇంట్లో ఒప్పుకున్నప్పటికి అతను దాదాపుగా పదేళ్లు వేచి చూశాడు అంట. వీరిద్దరి వివాహానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారట.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: