2010 సంక్రాంతి విన్నర్: ఇద్దరు సీనియర్ హీరోలను మడతెట్టేసిన ఎన్టీఆర్ అదుర్స్..!!

Pandrala Sravanthi
సంక్రాంతి వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు హడావిడి చేస్తుంటాయి. ఇక సంక్రాంతికి వచ్చి చాలామంది హీరోలు హిట్ కొడుతుంటే కొంతమంది హీరోలు సినిమాలు ప్లాప్ అవ్వడంతో అభిమానులను నిరాశ పరుస్తారు. మరి అలా 2010లో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డ హీరోలు ఎవరు.. ఏ సినిమాలు హిట్ అయ్యాయి. 2010 సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సినిమా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
 2010 సంక్రాంతి విన్నర్:

 2010 సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి.. రవితేజ శంభో శివ శంభో,వెంకటేష్ నమో వెంకటేశాయ, జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్,నవదీప్ కాజల్ అగర్వాల్ కాంబోలో వచ్చిన ఓం శాంతి.. ఈ నాలుగు సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 2010 సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ గా జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ మూవీ నిలిచింది.. వివి వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపత్రాభినయం చేసిన అదుర్స్ మూవీ 2010 జనవరి 13న విడుదలైంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపత్రాభినయంలో చేయగా బ్రాహ్మణ పాత్రలో చేసిన ఎన్టీఆర్ కి నయనతార జోడీగా మరో ఎన్టీఆర్ కి జోడిగా షీలా నటించింది..ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ మీమ్స్  ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ 2010 బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది.

ఇక ఆ తర్వాత రవితేజ నటించిన శంభో శివ శంభో,వెంకటేష్ నటించిన నమో వెంకటేశ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాల కంటే అదుర్స్ సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ నమో వెంకటేశాయ, శంభో శివ శంభో సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఓకే టాక్ తెచ్చుకున్నాయి.పెట్టిన బడ్జెట్ కి నిర్మాతకి లాభాలు అయితే తెచ్చిపెట్టాయి. ఇక ఈ మూడు సినిమాలు మధ్యలో భారీ అంచనాలతో విడుదలైన మరో సినిమా ఓం శాంతి.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, నవదీప్, నిఖిల్ సిద్ధార్థ్,బిందు మాధవి, అదితి శర్మ లాంటి భారీ తారాగణం నటించినప్పటికీ ఈ సినిమా 2010 సంక్రాంతికి వచ్చి భారీ డిజాస్టర్ అయింది. అలా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఓంశాంతి సినిమా ఫ్లాప్ అయింది. నమో వెంకటేశాయ, అదుర్స్, శంభో శివ శంభో వంటి మూడు సినిమాలు హిట్ అయ్యాయి. కానీ 2010 సంక్రాంతి విన్నర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ మూవీ అని చెప్పుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: