2019 సంక్రాంతి: ఎఫ్2 తో నవ్వులు పూయించిన సంక్రాంతి కొత్త అల్లుళ్లు..!!

Pandrala Sravanthi
ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు విడుదలవ్వడం ఆనవాయితీగా వస్తోంది.ఇక సంక్రాంతి వస్తుంది అనగానే ముందుగానే పెద్ద హీరోలు తమ సినిమాను సంక్రాంతికి విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. అలా ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్ లు పోటీ పడుతున్నారు.. ఇక ఈ ఏడాది వారి భవితవ్యం ఎలా ఉంటుందో సినిమాలు విడుదలయితే గాని చెప్పలేం. ఈ విషయం పక్కన పెడితే.. 2019 సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఏంటి.. ఆ సినిమాల్లో ఎవరు విజేతగా నిలిచారు అనేది ఇప్పుడు చూద్దాం..
 2019 సంక్రాంతి పోటీలో గెలిచిన విజేత:

2019 సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యాయి. అలా 2019లో సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ,వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ఎఫ్2, తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేట వంటి నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది మాత్రం ఎఫ్2 మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.చాలా రోజుల తర్వాత వెంకటేష్ కి సంబంధించి ఫుల్ లెన్త్ కామెడీని ఈ సినిమాలో చూసాం. అలా వెంకీ వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.

 ఈ సినిమా ఇప్పుడు టీవీలలో వచ్చినా కూడా చాలామంది కన్నార్పకుండా చూస్తూ ఉంటారు.ఈ సినిమాలో వెంకీ వరుణ్ తేజ్ ల కామెడీని ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ మూవీ జనవరి 12న విడుదలై నవ్వులు పూయించింది. ఇక అంతకంటే ముందు జనవరి 9న బాలకృష్ణ కథనాయకుడు మూవీ విడుదలైంది. ఈ సినిమా చూస్తున్న చాలామందికి మంచి అనుభూతి కలుగుతుంది. కానీ లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా హిట్ కాలేకపోయింది. అలాగే జనవరి 10న రజినీకాంత్ పేట సినిమా విడుదలైంది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఇక తర్వాత జనవరి 11న భారీ బడ్జెట్ తో వచ్చిన రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది.ఈ సినిమాలో ఉన్న కొన్ని సీన్స్ అయితే చాలా ట్రోలింగ్ కి గురయ్యాయి.ఇక ఆ తర్వాత వచ్చిన ఎఫ్2 మూవీ సంక్రాంతికి అసలైన విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: