పుష్ప 2: ఫర్ఫెక్ట్ గా అల్లు అర్జున్ నిర్మాతల వాదన.. సేఫ్..!
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ రవిశంకర్, నవీన్ పిటిషన్ దాఖలు వేయడం జరిగిందట. సంధ్య థియేటర్ ఘటన పైన తమ మీద నమోదు చేసినటువంటి కేసును సైతం కొట్టివేయాలంటూ ఒక పిటిషన్ కూడా ప్రొడ్యూసర్స్ వేశారట.. ముఖ్యంగా థియేటర్ భద్రత తమ పరిధిలో కాదని పిటీషనర్ న్యాయవాదులు వివరించారు. తమకు బాధ్యత ఉంది కాబట్టే ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు. సమాచారం ఇచ్చాము కాబట్టి అంతమంది పోలీసు బాలగాలు అక్కడికి వచ్చాయని తెలిపారు ప్రొడ్యూసర్స్ తరఫున న్యాయవాది.
దీంతో ఇలా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని ప్రొడ్యూసర్స్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారట. ఈ జరిగిన సంఘటన సినిమా ప్రొడ్యూసర్లను నిందితులుగా చేరిస్తే ఎలా అంటూ ప్రశ్నించడం జరిగింది దీంతో సినిమా ప్రొడ్యూసర్లను అరెస్టు చేయవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా జారీ చేసిందట. వీటిని కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక తదుపరి విచారణ మరో రెండు వారాల తరువాత వాయిదా వేసినట్లు తెలుస్తోంది హైకోర్టు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే నిర్మాతల పైన ఎలాంటి ఇబ్బందులు ఉండేలా కనిపించడం లేదు. ఈ కేసు కూడా హైకోర్టు లోనే క్లియర్ అయ్యేలా కనిపిస్తోందట.