ఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన డాన్స్ కొరియోగ్రాఫర్లలో ప్రభుదేవా ఒకరు. ఈయన అత్యంత చిన్న వయసు నుండే సినిమా పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ వస్తున్నాడు. ఇక ఈయన డాన్స్ కొరియోగ్రఫీ చేసిన ఎన్నో పాటలు , అందులోని డాన్స్ అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చిన్న వయసులోనే ఈయనకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అలా డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరియర్ను మొదలు పెట్టిన ప్రభుదేవా ఆ తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు.
ఇక ఈయన నటించిన సినిమాలు కూడా చాలానే మంచి విజయాలు సాధించడంతో ఈయనకు నటుడిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడం కూడా మొదలు పెట్టాడు. అందులో భాగంగా అనేక సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఈయన సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి శంకర్ మాట్లాడుతూ ... ఈ మూవీలోని ఒక పాటకు ప్రభుదేవా మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేశాడు. ఇక ఆయన మా సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రేమ్యునరేషన్ తీసుకోకుండా సాంగ్ కి డాన్స్ కొరియోగ్రఫీ చేశాడు. అలాగే ఆయన నాకు ఈ సినిమా కోసం ఎలాంటి రేమ్యునరేషన్ వద్దు కేవలం థాంక్స్ కార్డులో తన పేరు వేయండి చాలు అన్నాడు. ఆయనకు థాంక్స్ అని శంకర్ సభాముఖంగా చెప్పుకొచ్చాడు. ఇక శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.