మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి చాలా పెద్ద పండుగ. ప్రతి సంక్రాంతికి మంచి మంచి సినిమాలు కచ్చితంగా రిలీజ్ అవుతాయి. పెద్ద హీరోలు కూడా తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేసేందుకే.. ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య అటు విక్టరీ వెంకటేష్ లాంటి సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. ఇక 2022 సంవత్సరం సంక్రాంతి సందర్భంగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీని దున్నేశాడు.
2022 సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన అక్కినేని నాగార్జున అలాగే నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కథ సంక్రాంతికి దగ్గరగా ఉన్నట్లే మనకు కనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా మొత్తం పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో తీయడంతో సినిమా జనాలకు బాగా నచ్చింది. అంతేకాదు రమ్యకృష్ణ అలాగే కృతి శెట్టి అద్భుతంగా నటించి సినిమాకు.. మంచి బలాన్ని ఇచ్చారు.
ఈ సినిమాకు రివ్యూ రైటర్లందరూ 3 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. అలాగే... ఘట్టమనేని కుటుంబం నుంచి... గల్లా జయదేవ్ వారసుడు గల్లా అశోక్ 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పేరే హీరో. ఈ సినిమా 2022 జనవరి 15వ తేదీన రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. అశోక కొత్త హీరో అయినప్పటికీ సినిమా కథ... జనాలకు బాగా నచ్చింది. దీంతో సినిమా బంపర్ హిట్ కావడం జరిగింది.
ఇక ఇదే సంక్రాంతి బరిలో... దిల్ రాజు కుటుంబం నుంచి ఆశిష్... తన కొత్త సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమానే రౌడీ బాయ్స్. అయితే ఈ సినిమా 2022 జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. బంగారు రాజు అలాగే హీరోకు విభిన్నంగా ఈ సినిమా ఉంటుంది అందుకే.. సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. లవ్ అలాగే... రొమాన్స్, కామెడీ యాంగిల్ లో సినిమా కొనసాగింది. అనుపమ హాట్ గా నటించడంతో సినిమా బాగా హిట్ అయింది.