వేములవాడ రాజన్నను దర్శించుకున్న సోనియా, యష్
ఇక సోనియా బిగ్ బాస్ హౌస్ లో నాలుగైదు వారాల్లో ఉన్నప్పటికీ చాలా మందికి తెలిసిపోయింది. సోనియా ఆకుల అంటే ఇప్పుడు తెలియని వారంటూ ఉండరు.. ఎందుకంటే ఈమె బిగ్ బాస్ హౌస్ లో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అయితే సోనియా బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ లో నిఖిల్, పృధ్విలతో బాగా క్లోజ్ అయ్యింది. ఆమె ఏం చెబితే అది చేసేలా వాళ్లిద్దరిని మార్చేసింది. వాళ్లిద్దరితో క్లోజ్ గా ఉంటూ లవ్ స్టోరీ నడిపిస్తుంది అనే సారికి.. సడెన్ గా పెద్దోడు చిన్నోడు అంటూ మాట మార్చేసింది. అంతేకాదు తర్వాత తాను యష్ అనే అతనితో లవ్ లో విషయం కూడా చెప్పింది. బయటకు వెళ్లాక పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపింది. కానీ సోనియా నిఖిల్, పృధ్విని తనకి నచ్చినట్లు ఆడుస్తుందని టాక్ వచ్చింది. ఆ నెగిటివిటీ వల్లే సోనియా ఎలిమినేట్ అయ్యింది.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లి వచ్చాక యష్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. ఇటీవల వీరి వివాహం కూడా జరిగింది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి కూడా ఈ కొత్త జంట అడుగు పెట్టింది. అలాగే సోనియా ఆకుల ఆర్జీవి సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఒక స్వచ్చంధ సేవా సంస్థ కూడా నడిపిస్తుంది.