నందమూరి బాలకృష్ణ ఏ మాట మాట్లాడినా కూడా చాలా కఠినంగా మాట్లాడుతారు.. ఆయన మాట్లాడే మాటలు అభిమానులకు తప్ప ఇతరులకు నచ్చదు. అయితే చాలామంది ఈయనపై నెగటివ్ కామెంట్లు చేసేవారు ఈయన మాట తీరుని ఈయన చేష్టలని పట్టుకొనే వేలాడుతారు.కానీ బాలయ్య మంచి మనసు ఎలాంటిదో అర్థం చేసుకోరు.. ఆయన ఏ పని చేసినా కూడా దాంట్లో ఓ అర్థం దాగి ఉంటుంది. ఇప్పటికే ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు ప్రజాసేవ చేస్తూ రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. హిందూపురం తరపున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బాలకృష్ణ ఇప్పటికే పలు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.బసవతారకం ట్రస్టు ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లక్షలాది మంది క్యాన్సర్ పేషెంట్లు ఉచితంగా వైద్యం అందుకుంటున్నారు.
అయితే అలాంటి బాలకృష్ణ సినిమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈయన ఎన్.బి.కె 109 సినిమాలో చేస్తున్నారు. అలాగే అఖండ -2 సినిమాకు సంబంధించి కూడా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ఇక ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా వచ్చిం.ది అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు.
ఆ ప్రెస్ మీట్ లో ఎంతో మంది జర్నలిస్టులు బాలకృష్ణను ఎన్నో ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా ఓ జర్నలిస్ట్ అయితే ఏకంగా ఇప్పటివరకు మీరు మీ భార్యకు ఒక చీర అయినా కొని పెట్టారా అంటూ ప్రశ్న అడగడంతో కాస్త సీరియస్ అయినా బాలకృష్ణ ఇప్పుడు అవన్నీ అవసరమా.. అనవసరంగా మా కాపురం లో చిచ్చు పెడతారు అంటూ బాలకృష్ణ నవ్వే సారు.ఇక బాలకృష్ణ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. ఇక బాలకృష్ణ భార్య వసుంధర దేవి ఇప్పటివరకు భర్తకు సంబంధించిన అన్ని విషయాల్లో సపోర్ట్ గా నిలుస్తూ వస్తోంది.