ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే సినిమాను బాలయ్య వదులుకున్నాడా.. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..!?
మాఫియా బ్యాక్ డ్రాప్ లో, ఫ్లాష్ బ్యాక్ కథలతో కొత్త ట్రెండ్ సెట్ చేసింది కూడా ఈ సినిమానే. అదేవిధంగా రజినీకాంత్ స్టార్ డమ్‌ను ఈ సినిమా అమాంతం పెంచింది. ఈ సినిమాలోని డైలాగులు, ఫైట్లు, పాటలు అన్నీ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టేలా చేశాయి. దాదాపు ఏడాది పాటు థియేటర్లో ఆడిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రూ.40 కోట్లకు పైగా భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమాను తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ తో రీమేక్ చేయాలని దర్శకుడు సురేష్ కృష్ణ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలోనే భాషాను తెలుగులో రీమేక్ చేద్దామని బాలయ్యని కూడా ఎంతో బ్రతిమిలాడాడు.
రజినీకాంత్ ఇమేజ్ను ఆకాశానికి పెంచిన సినిమా ఇది .. అలాంటి సినిమా బాలయ్య రీమేక్ చేస్తే ఇంకా పెద్ద హిట్ అందుకో వచ్చుని దర్శకుడు సురేష్ కృష్ణ భావించారు. అయితే బాలయ్య రీమిక్ సినిమాల జోలికి పోను అని భాషను వదులుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు సురేష్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవిని కూడా సంప్రదించగా ఆయన కూడా రీమేక్ వద్దు డబ్బింగ్ చేయమని సలహా ఇచ్చారు. చిరంజీవి చెప్పినట్టు భాషా సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా.. ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగులో రజనీకాంత్ మార్కెట్ ని భారీగా పెంచింది. ఇక ఏదేమైనా భాషా సినిమాను వదులుకొని బాలయ్య పెద్దతప్పే చేశాడు.