హిట్టు కావలసిన సినిమాను ఫ్లాప్ చేసిన ఎన్టీఆర్.. ఆ మిస్టేక్ చేసి ఉండాల్సింది కాదు..?

Pulgam Srinivas
కొన్ని సినిమాలు కథ , కథనాలు అన్నీ బాగున్నా కూడా కొన్ని సందర్భాలలో ప్రేక్షకులను ఆకట్టుకోవు. అలాగే మరికొన్ని సినిమాలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉన్న ఏవో కొన్ని కారణాల వల్ల ప్రేక్షకులు వాటికి పెద్దగా కనెక్ట్ కారు. అలాంటి పరిస్థితుల్లో సినిమాలు ఫ్లాప్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో కూడా ఒక సినిమాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అది ఏ మూవీ అనుకుంటున్నారా ..? అదే ఊసరవెల్లి. కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఊసరవెల్లి అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. అద్భుతమైన స్థాయిలో సినిమా వెళుతుంది. అలాగే ఈ మూవీ లోని సాంగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అయినా కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానికి ప్రధాన కారణం ఈ సినిమా కథ మొత్తం ఎన్టీఆర్ సైడ్ నుండి కాకుండా తమన్నా సైడ్ నుండి ఉంటుంది. అసలు ఈ సినిమా కథకి ఎన్టీఆర్కు ఏ మాత్రం సంబంధం ఉండదు. పూర్తిగా తమన్నా సైడ్ నుండి ఈ కథ నడుస్తూ ఉంటుంది.

ఆమెకు సపోర్ట్ చేస్తే వ్యక్తి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తూ ఉంటాడు. ఇక స్టార్ హీరో అయి ఉండి అద్భుతమైన ఈమేజ్ కలిగిన ఎన్టీఆర్ వేరొకరి కథ కోసం పోరాడడం జనాలకు నచ్చలేదు అని కొంత మంది జనాల అభిప్రాయం. అందుకే ఈ సినిమా అద్భుతంగా ఉన్నా కూడా జనాలు కనెక్ట్ కాలేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి కొంత మంది ఎన్టీఆర్ ఈమేజ్ వల్లే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: