పుష్ప 2 నుండి ఫైరింగ్ అప్డేట్.. ఈ దెబ్బతో రిలీజ్ డేట్ పై నో కన్ఫ్యూజన్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొంత కాలం క్రితం ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
 

కానీ అప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన అనేక పనులు పెండింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక డిసెంబర్ 6 వ తేదీ దగ్గరకు వస్తున్న కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ మూవీ డిసెంబర్ 6 వ తేదీన కూడా విడుదల కావడం కష్టమే అని అనేక వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. దీనితో ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన కచ్చితంగా విడుదల కాబోతుంది అనే సంకేతాలను ఈ మూవీ బృందం ఇచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ఆఫ్ కాపీ పూర్తి అయినట్లు ప్రకటిస్తూ ఫస్ట్ ఆఫ్ లాకెడు అండ్ లోడెడ్ విత్ ఫైర్ అంటూ ఒక పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: