మహేష్ బాబు అల్లుడికి ఎందుకంత ధైర్యం.. వినొచ్చు కదా..?

Suma Kallamadi
సుధీర్ బాబు నటించిన 'మా నాన్న సూపర్ హీరో' సినిమా ప్రేక్షకుల్లో బాగా హైప్స్ క్రియేట్ చేసింది. ఈ దసరా పండుగ వేళ అందరూ కలిసి చూసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఈ సినిమాగా కనిపిస్తోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాని v సెల్యులాయిడ్స్, CAM ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించాయి. ట్రైలర్ చూస్తే, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఆనందంగా చూసేలా ఈ సినిమా ఉంటుందని అర్థమవుతుంది.
ఈ సినిమా బృందం, సినిమా విడుదలకు రెండు రోజుల ముందు విజయవాడ, విశాఖపట్నం లలో ప్రత్యేక ప్రదర్శనలు పెట్టాలని నిర్ణయించారు. అంటే, సినిమా అక్టోబర్ 11న విడుదల అయినా, ఈ రెండు నగరాలలో 9వ తేదీనే ప్రత్యేకంగా చూపించబోతున్నారు. ఇలా చేయడం వల్ల ఈ సినిమా చాలా బాగుందనే ఒక పాజిటివ్ టాక్ అందరికీ తెలిసిపోతుందని, విడుదలైన మొదటి రోజే చాలామంది వచ్చి తమ సినిమాను చూసే అవకాశం ఉంటుందని సుధీర్ బాబు నమ్ముతున్నాడట. ఆయన చెప్పినట్లు మూవీ టీం దీనిని రెండు రోజులు ముందే ప్రీమియర్ షోలు వేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కానీ ఇలా చేయడం చాలా రిస్క్ అని చెప్పుకోవచ్చు.
మామూలుగా ఒక సినిమా ఫస్ట్ డేనే పెట్టిన బడ్జెట్లో చాలావరకు డబ్బులు వెనక్కి తెచ్చిపెడుతుంది. ఒకవేళ సినిమా బాగోలేదని రిలీజ్ కి రెండు రోజుల ముందే తెలిస్తే ఎవరూ రారు. ఆ సినిమా ఆడే థియేటర్లు ఈగలు తోలుకోవాల్సిందే. సినిమాకి మంచి టాక్ వస్తే అది వేరే విషయం. అదే నెగిటివ్ టాక్ వస్తే మాత్రం నిర్మాతలు హీరో దర్శకులు అందరూ నిలువునా మునిగిపోవాల్సిందే. మహేష్ బాబు అల్లుడు ఎందుకు అంత ధైర్యం చేస్తున్నాడు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొందరు సుధీర్ బాబుకు ఇలా చేయడం చాలా రిస్క్ అని చెప్పారట కూడా అయినా సరే తన సినిమా కచ్చితంగా మంచి హిట్ అవుతుంది అని నమ్మకంతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీమియర్లకు టిక్కెట్లు ఇప్పుడు దొరుకుతున్నాయి. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకునే సినిమా బృందం, ఈ ప్రత్యేక ప్రదర్శనల ద్వారా ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. దసరా పండుగ సమయంలో ఈ సినిమా బాగా ఆడాలని వారు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: