ప్రస్తుతం మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొండా సురేఖ కామెంట్లపై సినీ ఇండస్ట్రీ విరుచుకు పడడంతో కొంతమంది సినీ ఇండస్ట్రీపై కూడా మండిపడుతున్నారు. ఒకప్పుడు చిరంజీవిని తిట్టినప్పుడు వీరంతా ఎక్కడ పోయారు. చిరంజీవి భార్యను, తల్లిని ఎంతో దారుణంగా తిట్టారు.కానీ వారి మాటల్ని ఖండించి సినీ ఇండస్ట్రీ నుండి మెగా ఫ్యామిలీకి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వలేదే.. అని అంటున్నారు.అయితే ఈ విషయంపై తాజాగా పోసాని కృష్ణ మురళి స్పందించారు.. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. అప్పట్లో నాకు మెగా ఫ్యామిలీతో గొడవలు ఉన్నది నిజమే.కానీ రాజకీయ నాయకులు చిరంజీవినీ మాత్రమే కాకుండా ఆయన భార్యని, తల్లిని తిట్టినప్పుడు సొంత తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏం పీకాడు.. అప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు రోడ్డుమీదకి వచ్చి రచ్చ చేయాలి కదా.. ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా తల్లిని నా వదిననే అంటారా అని ఖండించలేదు. సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏం పీకలేకపోయాడు.
ఇక సినిమా ఇండస్ట్రీని ఎందుకంటారు.ఆ సందర్భంలో రాజకీయ నాయకులు మెగా ఫ్యామిలీలోని ఆడవాళ్లను నిందించిన సమయంలో కొద్ది రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నాకు ఫోన్ చేసి చాలా ఏడ్చారు. మురళి నా భార్య పిల్లలు ఏం చేశారు. నా తల్లి ఏం చేసింది. ఎందుకు నా ఫ్యామిలీ మీద ఇలా మాట్లాడుతున్నారు అని ఏడ్చారు. అంత పెద్ద హీరో అలా ఏడ్చేసరికి నేను కూడా ఏడ్చేసాను. దాంతో మీరు ఫోన్ పెట్టేయండి అన్నయ్య నేను చూసుకుంటాను అని ఆయనకు మాట ఇచ్చి వెంటనే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే చిరంజీవిని,చిరంజీవి తల్లిని,భార్యని తిట్టారో వారందరితో క్షమాపణలు చెప్పించాను. కానీ పవన్ కళ్యాణ్ ఆ సమయంలో ఏం పీకాడు. ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కడిగి పారేయాలి కదా. చిరంజీవి నాకేమైనా రక్తసంబంధమా..
నేనెందుకు ఆయన గురించి ఆలోచించి ప్రెస్ మీట్ పెట్టి వారిని తిట్టిన వాళ్లతో క్షమాపణలు చెప్పించాను. నీ వదినకు తల్లికి నీ అన్నయ్యకు అవమానం జరిగితే నువ్వే ముందు ఇంటి నుండి బయటకు వచ్చి రచ్చ రచ్చ చేసి అడగాలి కదా.. ఎవడ్రా మా అమ్మని వదినని తిట్టేది అని బయటికి వచ్చి మీడియా ముందు తిట్టాలి కదా.ఎందుకు సొంత తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ఏం మాట్లాడలేదు.ఇప్పుడు నాగార్జునని అంటే సినిమా వాళ్ళు ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. సినిమా వాళ్ళని పక్కన పెడితే చిరంజీవి ఫ్యామిలీని తిట్టిన సమయంలో సొంత తమ్ముడు పవన్ కళ్యాణే బయటికి రాలేక ఏం పీకలేక ఇంట్లో మూసుకొని ఉన్నాడు అంటూ పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేశారు