జూనియర్‌ ఎన్టీఆర్‌ ను కోలుకోలేని దెబ్బకొట్టిన టాలీవుడ్‌ హీరో ?

Veldandi Saikiran
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. ఈ సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేవర సినిమా ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. కోరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయి. 

ఆచార్య లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమా చవిచూసిన అనంతరం కొరటాల శివ పట్టుదలతో దేవర సినిమా చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... తనను హీరోగా నటించమని వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయట. అందులో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారట.


ఆ సినిమాల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర. ఈ సినిమా కథని ముందుగా బోయపాటి శ్రీను తనకే చెప్పాడని ఎన్టీఆర్ అన్నాడు. అనుకోని కారణాలవల్ల ఈ సినిమాను వదులుకున్నానని చెప్పాడు. అనంతరం ఈ సినిమాలో రవితేజ, మీరా జాస్మిన్ ను పెట్టి భద్ర సినిమాను తీశారు. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీన్ని కూడా దిల్ రాజ నిర్మించారు.


ఆ తర్వాత ఈ సినిమాను వదులుకున్నందుకు చాలా బాధపడ్డానని ఇప్పటికి భద్ర సినిమా చేయనందుకు ఎంతో బాధపడుతూ ఉంటానని ఎన్టీఆర్ అన్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తారక్ దమ్ము సినిమా చేశారు. కానీ దమ్ము సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత బోయపాటితో సినిమా చేయలేదు. ప్రస్తుతం వార్-2, డ్రాగన్ సినిమాలు ఎన్టీఆర్ చేయనున్నాడు. ఆ రెండు సినిమాల అనంతరం దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ సినిమాలు చేసే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: