మొన్న ప్రభాస్.. నేడు ఎన్టీఆర్.. ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న టాలీవుడ్..!!

murali krishna
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సామాజిక కార్యక్రమాలపై, డ్రగ్స్ వ్యతిరేక అవగాహనా కార్యక్రమాలపై సినీ ప్రముఖులు ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మొన్న ఎన్టీఆర్ స్పదించిన సంగతి తేలిసిందే. ఎన్టీఆర్ ఎమన్నారంటే డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.ఈ క్రమంలో మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో.. క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడడం కోసమే లేదంటే సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమే.. మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం చాలా విలువైనది. రండి నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా.. కొనుగోలు చేస్తున్నా.. వినియోగిస్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించండి అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.అలాగే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా డ్ర‌గ్స్ కు వ్య‌తిరేకంగా ఓ 30 సెక‌న్ల వీడియోను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. అందులో యంగ్ రెబ‌ల్ స్టార్ మ‌న‌కు ఎన్నో అల‌వాట్లు ఉండ‌గా.. ఈ డ్ర‌గ్స్ మ‌నకు అవ‌స‌రమా డార్లింగ్స్ అని చెప్ప‌టంతో ఆయ‌న అభిమానులు కూడా డ్రగ్స్‌కు వ్య‌తిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారు.అయితే సీఎంగా రేవంత్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత టాలీవుడ్ ప్ర‌ముఖులను డ్ర‌గ్స్‌కు వ్య‌తిరేకంగా వీడియోలు చేయాల్సిందిగా కోరారు. అలా చేస్తేనే సినిమా టికెట్ల ధ‌ర‌లు పెంపు, బెనిఫిట్ షోల‌కు అవ‌కాశం ఇస్తామ‌ని మీడియా ముఖంగా చెప్పారు. అయితే సినిమా రిలీజుల స‌మ‌యంలో హీరోలు త‌మ వంతుగా వీడియోలు రిలీజ్ చేసి తెలంగాణ ప్ర‌భుత్వాన్ని అందించేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: