సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. కొన్ని రోజులగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా హుషారుగా జరుగుతోంది.అయితే సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుంది? అని అటు మహేష్ బాబు, రాజమౌళి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్ అదేమిటంటే ఒక సినిమా అనౌన్స్మెంట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడడం బహుశా ఇదే మొదటిసారేమో. ఒక్క తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం మొత్తం మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది.కానీ ఎలాంటి హడావిడి లేకుండానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కానిచ్చేశాడు జక్కన్న. మామూలుగా అయితే రాజమౌళి సినిమా ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ ఉంటుంది. కానీ ఈసారి అలాంటిదేమి లేదు. సడెన్‌గా సైలెంట్‌గా రాజమౌళి ముహూర్తం పెట్టేశాడు.
ఎస్ఎస్ఆర్ఎంబీ అధికారికంగా లాంఛ్ అయిపోయింది. హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి మహేష్ బాబుఎం నమ్రతా హాజరయ్యారయ్యారని సమాచారం. కానీ ఈ సినిమా లాంఛ్‌కు సంబంధించి రాజమౌళి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన గానీ, ఫొటోలు గానీ బయటికి రాలేదు. వాస్తవానికైతే ఎస్ఎస్ఆర్ఎంబీ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. కానీ రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండానే, ఫోటోలు బయటికి రాకుండానే పూజా కార్యక్రమం కానిచ్చేశాడు. ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నప్పటికీ ఇప్పటికైనా సినిమా మొదలుపెట్టినందుకు సంతోషమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేస్తున్నారు. రాజమౌళి లేకుండా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన మహేష్ బాబు, ఇప్పుడు జక్కన్నతో కలిసి హాలీవుడ్ సినిమా ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని ట్రెండ్ చేస్తున్నారు.
మరోవైపు SSRMB సినిమా స్పెషల్ ఫోటోను ఈ రోజు రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే మహేశ్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.ఇదిలావుండగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక దాంతో పాటుగా శ్రీతేజ్ పిల్లవాడు మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భాలను చూసిన రాజమౌళి తన సినిమా ఈవెంట్ ను గ్రాండ్ లాంచింగ్ చేస్తే అక్కడికి చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళను చూడానికి జనాలు భారీగా రావచ్చు కాబట్టి అక్కడ కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండచ్చు. ఇక రేవత్ ఘటన జరిగి నెల రోజులు కూడా కానీ సమయాన ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ ను కండక్ట్ చేయడం కంటే చిన్నగా ఈవెంట్ జరుపుకోవడమే ఉత్తమమని ఆలోచించిన రాజమౌళి చాలా సింపుల్ గా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసారు.