"అయిపోయింది..అంత అయిపోయింది..అనుకున్నదే జరిగింది"..బెంగళూరు సినిమా లవర్స్ కి బిగ్ ఊహించని షాక్..!

Thota Jaya Madhuri
గత కొద్ది రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మితమైన ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ ‘ఏఎం బీ సినిమాస్’ బెంగళూరులో ప్రారంభం కాబోతుందన్న వార్తలు  సినీ వర్గాల్లో, అభిమానుల్లో విస్తృతంగా ప్రచారం పొందాయి. ఎక్కడ చూసిన ఇదే టాపిక్ గురించి మాట్లాడుకున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 16వ తేదీన ఈ థియేటర్ ప్రారంభం అవుతుందని అనధికారికంగా వెలువడిన సమాచారం సోషల్ మీడియా వేదికగా వేగంగా వ్యాపించడంతో, బెంగళూరు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చించేద్దాం..పొడిచేద్దాం అనుకున్న సినీ ప్రేమికులకౌ బ్యాడ్ న్యూస్ వచ్చింది.  తాజాగా ఏఎం బీ సినిమాస్ విడుదల చేసిన అధికారిక ప్రకటనతో ఈ ప్రచారానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది.



డిసెంబర్ 16న ఓపెనింగ్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆ రోజు కోసం అనేక మంది సినీ అభిమానులు ముందుగానే సిద్ధమయ్యారు. కానీ, చివరి నిమిషంలో ఏఎం బీ సినిమాస్ అధికారికంగా చేసిన ప్రకటన బెంగళూరు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశకు గురి చేసింది. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఏఎం బీ సినిమాస్ ఒక షాకింగ్ ట్వీట్‌ను విడుదల చేసింది. బెంగళూరులో థియేటర్ ప్రారంభం గురించి జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎలాంటి నిజం లేదని ఆ ట్వీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.థియేటర్ ప్రారంభ తేదీ ఖరారైన తర్వాత మాత్రమే దానిని అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న తేదీలకు తాము ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో, డిసెంబర్ 16న ఏఎం బీ సినిమాస్ ప్రారంభం అవుతుందని నమ్మిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.



గతంలో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఏఎం బీ సినిమాస్ ప్రేక్షకులకు అందించిన అత్యాధునిక సాంకేతికత, విలాసవంతమైన సీటింగ్, ప్రపంచ స్థాయి సౌండ్ మరియు ప్రొజెక్షన్ వ్యవస్థలు సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ లగ్జరీ అనుభవం కారణంగానే బెంగళూరులో కూడా ఏఎం బీ సినిమాస్ ప్రారంభం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ మల్టీప్లెక్స్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామ్యం ఉండటం వల్ల కన్నడతో పాటు తెలుగు సినీ అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి.


డిసెంబర్ 16నే ఓపెనింగ్ అని  వచ్చిన వార్తల నేపథ్యంలో, చాలామంది సినీ ప్రేమికులు ఆ రోజున థియేటర్‌ను సందర్శించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ, ఊహించని విధంగా వచ్చిన ఈ వాయిదా ప్రకటన బెంగళూరు సినీ ప్రియులకు ఒక పెద్ద షాక్‌లా మారింది. ఈ నిర్ణయం వెనుక సాంకేతిక కారణాలు ఉండవచ్చని, లేదా తుది అనుమతులకు సంబంధించిన జాప్యం కారణంగా ప్రారంభాన్ని వాయిదా వేసి ఉండవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఏ కారణం ఏదైనా కానీ, అధికారికంగా కొత్త ప్రారంభ తేదీని ప్రకటించే వరకు బెంగళూరు ప్రేక్షకులు తమ నిరీక్షణను కొనసాగించక తప్పదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: