బ్యాచిలర్ లైఫ్‌కు బై బై..యాంకర్ రష్మి కూడా పెళ్లి చేసుకోబోతుందోచ్.. డేట్ కూడా చెప్పేసిందిగా..!?
కానీ అనూహ్యంగా గత రెండేళ్లుగా ఈ జంట మధ్య దూరం ఏర్పడింది. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోను విడిచిపెట్టిన తర్వాత, ఇద్దరూ కలిసి కనిపించడం చాలా అరుదుగా మారింది. దీంతో వారి మధ్య గ్యాప్ మరింత పెరిగిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయినప్పటికీ, కొన్నిసార్లు మాత్రమే వీరు కలుసుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగిస్తున్నామని చూపించడం విశేషం.ఇదిలా ఉండగా, నలభై ఏళ్లకు దగ్గరగా వచ్చినప్పటికీ రష్మి గౌతమ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారింది. అభిమానులతో పాటు మీడియా కూడా ఆమె పెళ్లి గురించి తరచూ ప్రశ్నలు వేస్తూ వస్తోంది. తాజాగా ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది.
‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లేటెస్ట్ ఎపిసోడ్‌లో పాల్గొన్న ఓ ఆస్ట్రాలజర్, రష్మి గౌతమ్ జాతకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది ఆగస్టు నెలలో రష్మి పెళ్లి జరగనుందని, ఆమె జీవితంలో పెళ్లి యోగం ఖచ్చితంగా ఉందని వెల్లడించాడు. అంతేకాదు, ఆమె మనసులో ఉన్న వ్యక్తితోనే వివాహం జరుగుతుందని చెప్పడంతో, ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి.ఈ వ్యాఖ్యలపై రష్మి గౌతమ్ కూడా స్పందించడం విశేషం. ఆస్ట్రాలజర్ చెప్పిన విషయాల్లో చాలా వరకు నిజం ఉందని ఆమె అంగీకరించింది. దీంతో రష్మి పెళ్లి వచ్చే ఏడాది ఆగస్టులోనే ఉండే అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
ఇక ఆమె మనసులో ఉన్న వ్యక్తి ఎవరు? అది సుడిగాలి సుధీరేనా? లేక మరెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన క్లిప్స్ ప్రస్తుతం వైరల్‌గా మారగా, రష్మి పెళ్లిపై అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.మరి రష్మి గౌతమ్ నిజంగానే వచ్చే ఏడాది పెళ్లి పీటలెక్కుతారా? ఆమె జీవిత భాగస్వామి ఎవరో త్వరలోనే వెల్లడవుతుందా? అన్నదానిపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.