వైయస్ జగన్: దోషులను కోర్టు ముందు నిలబెడతా.. కూటమికి జగన్ హెచ్చరిక..!?

Divya
తాజాగా విజయవాడలోని భవానీపురంలో మాజీ సీఎం వైయస్ జగన్ పర్యటించారు. భవానీపురంలో జోజి నగర్లో 42 మంది తమ ప్లాట్లను కోల్పోయిన కుటుంబాలను సైతం పరామర్శించారు. దీంతో వారి తరుపున ఆయన అనేక విషయాలను మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉందని, ఈనెల 31వ తేదీ వరకు ఈ 42 మంది కుటుంబాలకు సుప్రీంకోర్ట్ గడువు ఇచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని ,కానీ పోలీసులు సైతం ప్రైవేటు పార్టీలకు మద్దతు తెలుపుతూ ఇళ్లను కూల్చేస్తున్నారని ఫైర్ అయ్యారు.


ఇంకా 31వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇలా ఇళ్లను కూల్చేసి ఆ 42 కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 2.17 ఎకరాలు విలువైన ఈ భూమి రూ .150 కోట్లకు పైగా ఉంటుందని ఇక్కడ కుటుంబాలు 25 ఏళ్లుగా ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారని ఇప్పుడు వాళ్ళ అందరి ఇళ్లను ధ్వంసం చేయడమేంటి అంటూ ఫైర్ అయ్యారు. 2016లో 1981 డేట్ తో తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి ఈ భూమిని కాజేయాలని చూస్తున్నారని ఇందులో చంద్రబాబు, లోకేష్, కేశినేని చిన్ని, జనసేన పార్టీకి సంబంధించిన వారు ఇన్వాల్వ్ అయ్యారంటూ ఫైర్ అయ్యారు.



ఈ ఇళ్లులు కట్టుకోవడానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అనుమతి ఇచ్చిందని బ్యాంకులు కూడా ఇల్లు కట్టుకునేందుకు లోన్లు ఇచ్చారని, ఒకవేళ స్థలం ఇంకొకరిది అయితే రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని, అలాగే కరెంటు, డ్రైనేజీ పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు? బాధితులకు సైతం న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికే లేదని ఫైర్ అయ్యారు. అలాగే ఇళ్ల కూల్చివేతపై సిబిఐ విచారణ జరిపించాలని , బాధితులకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వమే కేటాయించి వారి బ్యాంకు లోన్లను కూడా గవర్నమెంట్ పూర్తి చేయాలంటూ జగన్ డిమాండ్ చేశారు. బాధితులకు వైసీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది.. ఒకవేళ ఈ ప్రభుత్వం ఎంక్వయిరీ వేయకపోతే కచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోషులు ఎంతటి వారైనా కోర్టు ముందు నిలబెడతానని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: