టాక్సిక్ సినిమా వాయిదా పై.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
అయితే విడుదల తేదీ విషయంలో పోస్ట్ పోన్ అంటూ వినిపిస్తూ ఉండడంతో తాజాగా మరొకసారి మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాక్సిక్ సినిమా దురంధర్ 2 సినిమా వల్ల వాయిదా పడుతుందనే విధంగా వినిపిస్తోంది. హీరో రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమాలో నటించగా భారీ సక్సెస్ అందుకుంది. కేవలం హిందీలో ఒక్కటే ఈ సినిమా రూ .1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. దురంధర్ 2 సినిమా కూడా మార్చి 19న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ రెండు బడా సినిమాల మధ్య ఒక బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది.
ఇటువంటి సందర్భంలోనే యష్ టాక్సిక్ సినిమా వాయిదా పడుతుందంటూ వినిపిస్తున్న వార్తల పైన తాజాగా మేకర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఎలాంటి కారణాల వల్ల కూడా టాక్సిక్ సినిమా వాయిదా పడే అవకాశం లేదంటూ క్లారిటీగా చెప్పేశారు. దీంతో టాక్సిక్ సినిమా వాయిదా అంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారు. దీన్నిబట్టి చూస్తే మార్చి 19వ తేదీన బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు వార్ సిద్ధమైనట్టుగానే కనిపిస్తోంది. మరి ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.