ఏపీ: మాజీ సీఎం జగన్ విజయవాడ పర్యటన.. ఎందుకంటే..?

Divya
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లి నుంచి విజయవాడలో కనకదుర్గమ్మ వారిది మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అయితే ఈ రూట్ మ్యాప్ రెండు రోజుల క్రితమే విడుదల చేశారు. ఈ రూట్ మ్యాప్ కు సంబంధించి పార్టీ నేతలు పోలీసులకు కూడా సమాచారాన్ని ఇచ్చారు. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ కారణం చేత వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలంటూ పోలీసులు గురువారం రాత్రి నోటీసుల ద్వారా ఒక ప్రకటన తెలిపారు.


దీంతో మాజీ సీఎం జగన్ ఏ రూట్ లో వెళ్తారు అనే విషయంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న తర్వాత మార్చే అవకాశం లేదనే విధంగా పార్టీ వర్గాలలో చర్చలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వైసిపి నేతల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ కూటమి నేతలు  దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఈరోజు వెళ్లనున్నారు. అలాగే జోగి రమేష్ కుటుంబీకులను కూడా పరామర్శించబోతున్నారు. ఈరోజు ఉదయం 10:30 నిమిషాలకు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరి ఆ తర్వాత కనకదుర్గమ్మ వారిది, ఆర్టీసీ బస్టాండ్, భీమవరం, మీదుగా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి చేరుకొని అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.


అనంతరం తిరిగి మళ్లీ మధ్యాహ్నం జగన్ నివాసమైన తాడేపల్లి కి చేరుకుంటారని  ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలియజేశారు. మరి ప్రస్తుతం పోలీసులు పెట్టిన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందనే విషయంపై ఇప్పుడు అటు వైసీపీ నేతలు, కూటమి కార్యకర్తలు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. బుధవారం రోజున అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడంతో అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు చేరడంతో ఇలాంటి ఆంక్షలు విధించారనే విధంగా వైసిపి కార్యకర్తలు నేతలు మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

AP

సంబంధిత వార్తలు: