గంభీర్ అన్నంత పని చేశాడు.. ఏకంగా రోహిత్ నే తప్పించాడుగా?

praveen

దేశ క్రికెట్ క్రీడా వర్గాల్లో కావచ్చు, క్రీడాభిమానుల్లో కావచ్చు... ఇపుడు అంతటా రోహిత్ శర్మ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. దానికి కారణం అందరికీ తెలిసిందే. భారత్ - ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా 5వ మ్యాచ్ జరుగుతున్న తరుణంలో ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ భాగస్వామ్యం కాకపోవడంతో సర్వత్రా అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. ఈ మ్యాచ్ రోహిత్ టెస్టు కెరీర్‌లో చివరి మ్యాచ్ అని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన తరుణంలో అతనికి ఇపుడు ఈ సిడ్నీ టెస్టు ఆడే అవకాశం కూడా రాకపోవడం చాలా విచారకరం.
రోహిత్ శర్మ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 3 ఫార్మాట్లలోనూ టీమిండియా టాప్‌కు చేరుకోవడంలో రోహిత్ శర్మ చాలా కీలక పాత్ర పోషించాడు అనడంలో అతిశయోక్తి లేదు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా గత కొన్నేళ్లలో భారత జట్టుకి ఎనలేని సేవలు చేసాడు. కానీ క్రమంగా తన ప్రభావం కోల్పోతూ వస్తున్న హిట్‌మ్యాన్ కెరీర్ చరమాంక దశకు చేరుకుంది. టీ20 వరల్డ్ కప్-2024 తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతడు.. వన్డేలు, టెస్టుల్లో కంటిన్యూ అవుతున్న సంగతి విదితమే. చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కూ అతడు గుడ్‌బై చెప్పడం ఖాయం అనుకున్నారు. అయితే వన్డేల కంటే ముందు టెస్టుల నుంచి రోహిత్ తప్పుకోవడం దాదాపుగా ఖాయం అని తెలుస్తోంది.
అవును, అతడి నుంచి సారథ్య పగ్గాలను లాక్కోవడమే దీనికి పెద్ద ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో రోహిత్‌ను ఏకాకిని చేసేశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. విషయం ఏమిటంటే.. గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి రోహిత్ ఆటతీరుతో చాలా మార్పులు వచ్చాయి. అటు వన్డేలు, ఇటు టెస్టుల్లో దారుణంగా పెర్ఫార్మ్ చేసినా అతని బ్యాట్ నుండి మినిమమ్ పరుగులు రావడం లేదు. సెంచరీ మాట దేవుడెరుగు.. హాఫ్ సెంచరీ కొట్టడం కూడా గగనం అయిపోయింది. సేమ్ టైమ్ శ్రీలంక చేతుల్లో వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్ సిరీస్‌లో వైట్‌వాష్, ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో వరుస పరాజయాలు రోహిత్‌ కెరీర్ గ్రాఫ్‌ను కంప్లీట్‌గా కిందకు పడేశాయి.
దాంతో కోచ్ గంభీర్, బీసీసీఐ పెద్దలు, సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును, ఈ క్రమంలోనే నేడు సిడ్నీ వేదికగా జరగనున్న ఆఖరి టెస్ట్‌కు రోహిత్‌ను పక్కనబెట్టాలని వినికిడి. అందుకే అతడి నుంచి కెప్టెన్సీ పగ్గాలను పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు అప్పగించే ఏర్పాటు చేసారు. అయితే మొదట రోహిత్ స్థానంలో మరో సీనియర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పగించాలని తొలుత అనుకున్నారని వినికిడి. . అయితే కోహ్లీ కూడా ఫామ్ కోల్పోవడం, వయసు మీద పడటం, కెరీర్ ఎండింగ్‌లో ఉండటంతో ఆ ఆలోచనను మానుకున్నారట!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: