`ఆ తెలంగాణ స్పెషల్.. ఇక ఇప్పుడు ఏపీలో కూడా?
ఈ సందర్శనలో అమరావతిలో జీవ వైవిధ్యం, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలు ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. కమలేష్ పటేల్ గారు తెలంగాణలోని కన్హా ఆశ్రమంలో అనుసరిస్తున్న పచ్చదనం, సుస్థిర అభివృద్ధి మోడల్‌ను అమరావతికి విస్తరించే అవకాశాలపై ఆసక్తి చూపారు. మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి గార్లు కమలేష్ పటేల్ ని ఆశ్రమ సందర్శనకు ఆహ్వానించారు.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతివనాన్ని సందర్శించి కమలేష్ పటేల్ గారితో చర్చలు జరిపారు. ఆ సందర్శనలో వెల్నెస్ సెంటర్లు, ధ్యాన కేంద్రాలు, యోగా సౌకర్యాలు, చెట్ల సంరక్షణ ప్రాజెక్టులను పరిశీలించారు. కన్హా ఆశ్రమం 1400 ఎకరాల్లో విస్తరించి లక్షలాది చెట్లతో పచ్చదనం సృష్టించిన తీరు చంద్రబాబును ఆకట్టుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన హాల్ ఉన్న ఈ ఆశ్రమం సుస్థిర జీవనశైలి మోడల్‌గా నిలుస్తోంది.
ఈ అనుభవం నుంచి ప్రేరణ పొందిన చంద్రబాబు గారు అమరావతిని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే దిశలో అడుగులు వేస్తున్నారు. కమలేష్ పటేల్ గారి సందర్శన ఈ దిశలో మరింత బలాన్ని ఇస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య సహకారం పెరుగుతూ అమరావతి అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తోంది. అమరావతిలో ఇలాంటి వెల్నెస్ సెంటర్ ఏర్పాటు రాజధానిని ఆధ్యాత్మిక, పర్యావరణ హబ్‌గా మార్చే అవకాశం ఉంది. సీఆర్డీయే అధికారులు ఈ దిశలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు