రంగంలోకి ఏపీ పోలీసులు..అజ్ఙాతంలోకి మాధవీ లత ?
మాధవి లత టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తరచూ మాట్లాడుతూ ఉండేవారు. కాస్టింగ్ కౌచ్ పైన మాధవి లత చాలా సందర్భాలలో మాట్లాడారు. తెలుగు హీరోయిన్లకు ఎందుకు అవకాశాలు ఇవ్వరని మాధవి లత ప్రశ్నించింది. పొరుగింటి పుల్లకూర రుచి కాబట్టి మన తెలుగు హీరోయిన్లు అంటే దర్శకులకు, నిర్మాతలకు అసలు నచ్చరు అంటూ కామెంట్ చేసింది.
అయితే తాజాగా మాధవి లతకు బిగ్ షాక్ ఎదురైంది. తనపై పోలీస్ కేసు నమోదు అయింది. అనంతపురం జిల్లా తాడిపత్రి గురించి అనుచిత వాక్యాలు చేశారు. ఈ తరుణంలోని మాధవి లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టిడిపి కౌన్సిలర్లు, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ. డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో ఓన్లీ ఫర్ ఉమెన్ తో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ పార్క్ సమీపంలో పెన్నా నదిలో కొంతమంది గంజాయి మద్యం సేవిస్తూ ఉంటారని ఆ వేడుకలకు వెళ్ళవద్దని మహిళలకు సోషల్ మీడియాలో మాధవి లత పోస్ట్ పెట్టారు.
దీంతో ఆమెపై టిడిపి నేతలు కేసు పెట్టారు. ఈ కేసు పట్ల మాధవి లత అజ్ఞాతంలోకి వెళ్లిందని ప్రచారం జరుగుతుంది. కాగా జనవరి 2వ తేదీ తెల్లవారుజామున జెసి బస్సులు దగ్ధం అయ్యాయి. బిజెపి నేతలు బస్సు దహనం చేసి ఉండవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేమైతే ఎలాంటి కంప్లైంట్ ఇవ్వమని ప్రకటన చేశారు. జెసి పోలీసులే సుమోటోగా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్లు చేశారు. నిన్న రాత్రి ప్రెస్ మీట్ లో బిజెపి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి మీ కన్నా జగన్ బెటర్ అంటూ ఫైర్ అయ్యాడు.