అనిరుద్ చేతిలో ఇన్ని తెలుగు సినిమాలున్నాయా.. మరి ఇంతా చిన్న సినిమాకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడా..?

Pulgam Srinivas
ప్రస్తుతం ఇండియా వ్యాప్తం గా అద్భుతమైన క్రేజ్ ఉన్న సంగీత దర్శకుల లో అనిరుద్ రవిచంద్రన్ ఒకరు . ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించి తన సంగీతం తోనే సినిమాలకు విజయాలను అందించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి . అలా ఈయన తన సంగీతం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటంతో ఈయనకు క్రేజ్ ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో ఉంది . ఇది ఇలా ఉంటే ఈయన ప్రస్తుతం తెలుగులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు . తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో దేవరా పార్ట్ 1 మూవీ రూపొంది న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విషయంలో కాస్త నెగిటివ్ ట్యాంక్ వచ్చినా కూడా ఈ మూవీ కి అనిరుద్ మాత్రం అద్భుతమైన సంగీతం అందించాడు అనే ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఈయన చేతిలో ఏ తెలుగు సినిమాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న VD 12 అనే సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు.

అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న మ్యాజిక్ అనే మరో చిన్న సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. నాని , శ్రీకాంత్ ఓదెల కాంబోలో సినిమాకు ఈ అనే సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దేవర పార్ట్ 2 మూవీ కి కూడా ఈయన సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఈయన సంగీతం అందిస్తున్న అన్ని సినిమాల్లో మ్యాజిక్ చిన్న సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: