కొరటాల శివ "మిర్చి" మూవీతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను మూవీ లతో వరస విజాయలను అందుకున్నాడు. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈయన కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ లో మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కథలో అనేక మార్పులు , చేర్పులు చేశాడు. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. కొరటాల శివ కు పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు.
ఆయనకు పూర్తి స్వేచ్ఛ ను ఇచ్చినట్లయితే ఆయన సినిమాను అద్భుతంగా తీసేవాడు అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా కొరటాల , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభిస్తుంది. దానితో కొంత మంది జనాలు ఆచార్య ప్లాప్ అయినప్పుడు చిరంజీవి వల్ల ఆ సినిమా ప్లాప్ అయ్యింది అన్నారు. మరి దేవర విషయంలో కొరటాల ఏం చేశాడు అనే వాదనను తెరపైకి తెస్తున్నారు. ఇకపోతే దేవర మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించినట్లయితే రెండవ భాగం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.